Delhi Floods | గతకొన్ని రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు దేశ రాజధాని (Delhi) ప్రాంతం ఢిల్లీ-ఎన్సీఆర్ అతలాకుతలమవుతున్నది. కుండపోత వర్షాలకు జనజీవనం స్తంభించిపోయింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా యమునా నది (Yamuna River) ఉప్పొంగింది. డేంజ్మార్క్ను దాటి ప్రవహిస్తోంది. దీంతో ఢిల్లీని వరద ముంచెత్తింది. నిరాశ్రయుల కోసం ఏర్పాటుచేసిన పునరావాస కేంద్రాలు కూడా నీటమునిగాయి (Relief Camps Submerged).
#WATCH | Delhi | Some of the relief camps set up near Mayur Vihar-Phase 1 are flooded as the Yamuna River continues to swell due to continuous rainfall pic.twitter.com/4tYpOnjp6D
— ANI (@ANI) September 4, 2025
అధికారిక సమాచారం ప్రకారం.. ఢిల్లీలోని ఓల్డ్ రైల్వే బ్రిడ్జి (Old Railway Bridge) వద్ద యమునా నది నీటి మట్టం గురువారం ఉదయం 7 గంటలకు 207.48 మీటర్లుగా ఉంది. అదే ఉదయం 5 గంటల సమయంలో 207.47 మీటర్లుగా ఉంది. తెల్లవారుజామున 2 గంటల నుంచి 5 గంటల మధ్య నదిలో నీటి మట్టం 207.47 మీటర్ల వద్ద స్థిరంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. 5 గంటల తర్వాత వరద ప్రవాహం పెరుగుతుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
#WATCH | Vehicles submerged, buildings flooded on Bela Road in Delhi’s Civil Lines as water from the overflowing Yamuna river entered the area. pic.twitter.com/S3js3aFEXK
— ANI (@ANI) September 4, 2025
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా అలీపుర్ ప్రాంతంలో రోడ్డు పైనే లోతుగా గొయ్యి ఏర్పడింది. సివిల్ లైన్స్ ప్రాంతంలో భారీగా వరద నిలిచింది. దీంతో కార్లు నీట మునిగాయి. బేలా రోడ్లోని భవనాల్లోకి వరద (Flood) నీరు ప్రవేశించింది. కశ్మీర్ గేట్ పరిసరాల్లోనూ వర్షం నీరు నిలిచిపోయింది. ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో యమునా నది పొంగిపొర్లుతోంది. రోడ్లపైకి నీరు చేరడంతో ట్రాఫిక్ నెమ్మదిగా ముందుకు కదులుతున్నట్లు అధికారులు తెలిపారు.
#WATCH | Delhi | A portion of the flyover on National Highway 44 under the Alipur police station area caved in following heavy rains. pic.twitter.com/za3L1jKwdG
— ANI (@ANI) September 4, 2025
భారీ వర్షాల తాకిడితో ఢిల్లీ విమానాశ్రయంలో వందలాది విమానాలపై ప్రభావం పడింది. దాదాపు 340కిపైగా విమాన రాకపోకలు ఆలస్యమయ్యాయి. ఎయిర్పోర్టుకు సమీపంలో ట్రాఫిక్ జామ్ ఏర్పడటంతో, వేలాది వాహనాలు రోడ్లపైనే నిలిచిపోయాయి. మరోవైపు భారీ వర్షాలు కొనసాగుతున్న నేపథ్యంలో అధికారులు ఢిల్లీక వరద హెచ్చరికలు చేశారు. వరద ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
#WATCH | Delhi: Parts of the Kashmere Gate area flooded as water level of the River Yamuna rises.
Drone visuals from the area shot at 7:10 am today. pic.twitter.com/QhtbK6DiYO
— ANI (@ANI) September 4, 2025
#WATCH | Delhi | Drone visuals from Loha Pul, where the Yamuna River is flowing above the danger level following incessant rainfall.
Those living in low-lying areas near the Yamuna River were relocated to safer sites, anticipating the flood emergency. pic.twitter.com/bA9TlnYD5k
— ANI (@ANI) September 4, 2025
Also Read..
Shilpa Shetty | కొత్తగా మీ ముందుకొస్తున్నాం.. రెస్టారెంట్ మూసివేతపై క్లారిటీ ఇచ్చిన శిల్పా శెట్టి
Shikhar Dhawan | చిక్కుల్లో శిఖర్ ధావన్.. బెట్టింగ్ యాప్ కేసులో విచారణకు రావాలని ఈడీ సమన్లు
Luxury Yacht | ప్రారంభించిన నిమిషాల్లోనే.. సముద్రంలో మునిగిపోయిన లగ్జరీ నౌక.. VIDEO