Shikhar Dhawan | బెట్టింగ్ యాప్స్ ( betting app case) వ్యవహారం ప్రస్తుతం దేశవ్యాప్తంగా దుమారం రేపుతోంది. బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేసిన కారణంగా ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు విచారణ ఎదుర్కొన్న విషయం తెలిసిందే. తాజాగా టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్ (Shikhar Dhawan) కూడా ఆ లిస్ట్‌లో చేరిపోయారు. బెట్టింగ్ యాప్ కేసులో విచారణకు హాజరు కావాలంటూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate) అధికారులు శిఖర్ ధావన్‌కు తాజాగా సమన్లు జారీ చేశారు. 1xBet అనే యాప్‌కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.
అక్రమ బెట్టింగ్ యాప్‌లకు సంబంధించిన కేసులను ఈడీ దర్యాప్తు చేస్తున్న విషయం తెలిసిందే. బెట్టింగ్ యాప్స్ చాలా మంది వ్యక్తులతో పాటు పెట్టుబడిదారులను రూ.కోట్లల్లో మోసం చేయడంతో పాటు భారీ మొత్తంలో పన్ను ఎగవేసినట్లు ఆరోపణలున్నాయి. ఇక నిషేధిక బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేసిన కారణంగా ఇప్పటికే పలువురు టాలీవుడ్, బాలీవుడ్ సెబ్రిటీలు కూడా విచారణకు హాజరైన విషయం తెలిసిందే. మాజీ క్రికెటర్ సురేశ్ రైనా సైతం గత నెల ఈడీ ముందు హాజరయ్యారు.
Also Read..
Shilpa Shetty | కొత్తగా మీ ముందుకొస్తున్నాం.. రెస్టారెంట్ మూసివేతపై క్లారిటీ ఇచ్చిన శిల్పా శెట్టి
GST On Sports | ఐపీఎల్ అభిమానులకు షాక్..! టికెట్లపై 40శాతం జీఎస్టీ..!
BCCI President | బీసీసీఐ అధ్యక్షుడిగా మాజీ క్రికెటర్..! ఇంతకీ ఆ ప్లేయర్ ఎవరు..?