Shilpa Shetty | బాలీవుడ్ నటి శిల్పాశెట్టి (Shilpa Shetty) తన రెస్టారెంట్‌ను మూసివేస్తున్నట్లు ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. 2016లో బాంద్రా ప్రాంతంలో శిల్పా శెట్టి తన తొలి బ్రాంచ్‌ను ప్రారంభించారు. ముంబై నగరంలోనే ఈ బాస్టియన్ (Bastian) రెస్టారెంట్‌కు మంచి పేరుంది. అయితే, అనూహ్యంగా దీన్ని మూసివేస్తున్నట్లు నిన్న సోషల్ మీడియా వేదికగా ప్రకటన చేశారు. అందుకుగల కారణాలను మాత్రం ఆమె వెల్లడించలేదు. దీంతో అందుకు గల కారణాలు తెలుసుకునేందుకు నెటిజన్లు ఆసక్తి చూపుతున్నారు. ఈ మేరకు ‘రెస్టారెంట్‌ను ఎందుకు మూసివేస్తున్నారు..?’ అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో దీనిపై నటి శిల్పా శెట్టి క్లారిటీ ఇచ్చారు.
‘బాస్టియన్’ రెస్టారెంట్‌ను మూసేస్తున్నట్లు ప్రకటించిన తర్వాత తనకు వేల సంఖ్యలో ఫోన్‌కాల్స్ వస్తున్నాయని తెలిపారు. దాన్ని పూర్తిగా మూసివేయడం లేదని క్లారిటీ ఇచ్చారు. తాము ఓ అధ్యాయాన్ని ముగించామని వివరించారు. ‘బాస్టియన్ బీచ్ క్లబ్’ పేరుతో జుహు (Juhu) ప్రాంతంలో కొత్తగా ప్రారంభించబోతున్నట్లు ప్రకటించారు. దక్షిణ భారతదేశంలో మంగుళూరు వంటకాలు అందించనున్నట్లు వెల్లడించారు. ఎన్ని బ్రాంచ్‌లు తెరిచినా బాంద్రాలోని రెస్టారెంట్ మాత్రమే వాటికి మూలం అని పేర్కొన్నారు. ఇది ఎప్పటికీ ప్రత్యేకమేనని దీన్ని పూర్తిగా మూసివేస్తాం అనే ప్రచారంలో నిజం లేదని స్పష్టం చేశారు. అక్టోబర్‌లో దీన్ని జుహులో అందుబాటులోకి తీసుకురానున్నుట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.
బాస్టియన్‌ను మూసివేస్తున్నాం.. శిల్పాశెట్టి
కాగా, ఈ రెస్టారెంట్‌ను మూసివేస్తున్నట్లు శిల్పాశెట్టి సోషల్ మీడియా వేదికగా తెలుపుతూ.. ముంబైలో ఎంతో పాపులర్ అయిన బాస్టియన్‌కు వీడ్కోలు పలుకుతున్నాం. ఈ గురువారం బాస్టియన్ బాంద్రాకు చివరిరోజు. ఇది ముంబైలోని ఐకానిక్ డెస్టినేషన్స్‌లో ఒకటిగా నిలిచిపోయింది. లెక్కలేనన్ని జ్ఞాపకాలు, మర్చిపోలేని రాత్రులు, నగర నైట్‌లైఫ్‌ను మార్చిన క్షణాలను ఇది మాకు ఇచ్చిందంటూ శిల్పా రాసుకొచ్చింది. అయితే శిల్పా ఈ రెస్టారెంట్‌ను మూసివేయడానికి గల కారణాన్ని వెల్లడించలేదు. తనపై తన భర్తపై నమోదైన రూ. 60 కోట్ల మోసం కేసు నేపథ్యంలో శిల్పా ఈ నిర్ణయం తీసుకున్నట్లు నెట్టింట ప్రచారం జరిగింది. ఒక వ్యాపారవేత్తను పెట్టుబడి పేరుతో మోసం చేశారని ఈ దంపతులపై ముంబై పోలీసుల ఆర్థిక నేరాల విభాగం (EOW) కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. అయితే, తాజాగా రెస్టారెంట్ మూసివేతకు గల కారణాలను వెల్లడించారు శిల్పా.
Also Read..
Nishaanchi | హీరోగా ఎంట్రీ ఇస్తున్న బాల్ ఠాక్రే మనవడు .. ఆసక్తి పెంచుతున్న ట్రైలర్
Ghaati | ఘాటి అడ్వాన్స్ బుకింగ్స్ అదుర్స్.. హాట్ కేకుల్లా అమ్ముడవుతున్న టిక్కెట్స్
Raashi Khanna | హీరోయిన్ కాకుంటే రాశీ ఖన్నా ఏమయ్యేదో తెలుసా.. అదే తన డ్రీమ్ అట..!