బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్లో ప్రజా రవాణా వ్యవస్థ దారుణంగా ఉన్నది. దాదాపు ౪,౭౯౩ గ్రామాలకు ఇప్పటికీ బస్సు సౌకర్యం లేదు. ఈ గ్రామాల ప్రజలు ఎటైనా వెళ్లాలంటే ఆటోలో లేదా బైక్పై పోవాల్సిందే.
ఉత్తర ప్రదేశ్లోని ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల్లో పనిచేస్తున్న వందలాది మంది టీచర్లకు గత ఏడాదిగా యోగీ సర్కార్ జీతాలు చెల్లించకపోవడంతో నిరహార దీక్షలకు దిగారు.
బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్లో మధ్యాహ్న భోజన పథకం అమలు అస్తవ్యస్థంగా తయారైంది. యోగి సర్కార్ నిధులు విడుదల చేయకపోవడంతో పాటు మధ్యాహ్న భోజన కార్మికులకు గత ఆర్నెల్లుగా వేతనాలు చెల్లించడం లేదు.
ఉత్తరప్రదేశ్లోని బీజేపీ ‘డబుల్ ఇంజిన్ సర్కార్' గత 6 నెలల నుంచి ఆశా వర్కర్లకు వేతనాలు చెల్లించడం లేదు. దీంతో వారు మరోసారి ఆందోళనకు దిగారు. పెండింగ్ వేతనాల కోసం నిరవధిక సమ్మె నిర్వహిస్తున్నారు.