Harish Rao | మొక్కజొన్న రైతులను కాంగ్రెస్ సర్కార్ ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ అసెంబ్లీకి వచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో మార్షల్స్ దురుసుగా ప్రవర్తించారు. అసెంబ్లీ ఎంట్రన్స్ వద్ద ఎమ్మెల్యేల నుంచి మక్కలు, కందులు లాక్కున్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు చేతికి గాయమైంది. గాయం కావడంతో హరీశ్‌రావు చేతి నుంచి రక్తం కూడా వచ్చింది.
మరోవైపు అసెంబ్లీ ఎంట్రన్స్ వద్ద పాడి కౌశిక్ రెడ్డి చేతిలో నుంచి చీఫ్ మార్షల్ కరుణాకర్ మక్కలు లాక్కొని కిందపడబోశారు. మార్షల్స్ తీరుపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎంట్రన్స్ వద్ద కూర్చొని నిరసన తెలిపారు. మార్షల్స్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
రౌడీలలాగా ఎమ్మెల్యేల చేతిలో నుండి మొక్కజొన్న కంకులు లాక్కున్న అసెంబ్లీ మార్షల్స్ https://t.co/Pm3PnNb8Gm pic.twitter.com/GEkkAcnXSy
— Telugu Scribe (@TeluguScribe) March 18, 2026
అసెంబ్లీలో ఎమ్మెల్యేల ఎంట్రన్స్ వద్ద అడ్డుకున్న మార్షల్స్
ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి చేతిలో నుంచి మక్కలు లాక్కొని క్రింద పోసిన చీఫ్ మార్షల్ కర్ణాకర్
ఎంట్రన్స్ వద్ద కూర్చొని నిరసన తెలుపుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు
మార్షల్స్ కి వ్యతిరేకంగా నినాదాలు.. pic.twitter.com/cTMou83JPf
— Telugu Scribe (@TeluguScribe) March 18, 2026