Vithya Ramraj : ప్రతిష్ఠాత్మక ఆసియా క్రీడల్లో చరిత్రాత్మక పతకం సాధించిన విద్య రామరాజ్(Vithya Ramraj)పై ప్రశంసలు కురుస్తున్నాయి. మహిళల 400మీ హర్డిల్స్‌లో జాతీయ రికార్డు బద్ధుల కొడుతూ కాంస్యంతో మెరిసిన విద్యకు భారీ నగదు ప్రోత్సాహం లభించింది. తమ రాష్ట్రానికి చెందిన తను పతకం గెలవడం పట్ల సంతోషం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ (Joseph Vijay) రూ.30 లక్షల రివార్డు ప్రకటించారు. తమిళనాడు సహా యావత్ భారతావనిని సంబురాల్లో ముంచెత్తిన విద్యకు సీఎం ప్రత్యేకంగా అభినందించారు.
పద్దెనిమిదో ఆసియా క్రీడల్లో రెండు పతకాలు గెలుపొందిన అథ్లెట్ విద్య రామరాజ్‌ను తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ జోసెఫ్ అభినందించారు. జాతీయ రికార్డు బ్రేక్ చేసి.. పోడియం మీద మువ్వన్నెల జెండాను రెపరెపలాడించిన ఆమెకు నగదు ప్రోత్సాహం అందించారు విజయ్. ఈ విషయాన్ని మంగళవారం సీఎం ఎక్స్ పోస్ట్ ద్వారా వెల్లడించారు.
ஜப்பானில் நடைபெற்றுவரும் ஆசிய விளையாட்டுப் போட்டியில், பெண்கள் 400 மீட்டர் தடை ஓட்டப் பிரிவில் வெண்கலப் பதக்கம் வென்று தமிழ்நாட்டிற்கும், இந்தியாவிற்கும் பெருமை சேர்த்துள்ள தடகள வீராங்கனை வித்யா ராம்ராஜ் அவர்களுக்கு எனது மனமார்ந்த பாராட்டுகளையும், நல்வாழ்த்துகளையும் தெரிவித்துக்… pic.twitter.com/2SKLnc9H1Z
— CMOTamilNadu (@CMOTamilnadu) September 28, 2026
‘అథ్లెట్ విద్య రామరాజ్కు హృదయపూర్వక శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తున్నా. జపాన్‌లో జరుగుతున్న ఆసియా క్రీడల్లో మహిళల 400 మీటర్ల హర్డిల్స్‌లో కాంస్యంతో తమిళనాడుతో పాటు భారత దేశం గర్వపడేలా చేసింది విద్య. భారత అథ్లెటిక్స్ దిగ్గజం పీటీ ఉష 1984లో నెలకొల్పిన జాతీయ రికార్డును 42 ఏళ్ల తర్వాత బద్ధలు కొడుతూ విద్య సరికొత్త రికార్డు సృష్టించడం మరింత ప్రశంసనీయం. ఆమె అత్యుత్తమ ప్రదర్శనకు గుర్తింపుగా తమిళనాడు ప్రభుత్వం తరఫున రూ.30 లక్షల నగదు బహుమతి అందిస్తాం. విద్య సాధించిన ఈ విజయం తమిళనాడులోని యువత, మహిళల్లో స్ఫూర్తిని, ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది. భవిష్యత్‌లో ట్రాక్ ఆండ్ ఫీల్డ్ అథ్లెట్ విద్య రామరాజ్ మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నా’ అని సీఎం విజయ్ ఎక్స్ పోస్ట్‌లో పేర్కొన్నారు.
ఆసియ క్రీడల్లో విద్య రామరాజ్ సత్తా చాటింది. మిక్స్డ్ 4×400 మీటర్ల రీలేలో సిల్వర్ మెడల్ సాధించిన తను వ్యక్తిగత విభాగంలోనూ కాంస్యం పట్టేసింది. సోమవారం జరిగిన మహిళల 400 మీటర్ల హర్డిల్స్ ఫైనల్లో విద్య అద్భుత ప్రదర్శన చేసింది. జాతీయ రికార్డును బద్ధలు కొడుతూ 54.57 సెకన్లలోనే విద్య లక్ష్యాన్ని చేరుకుంది. ఇదివరకూ 55.42 సెకన్లతో పీటీ ఉష రికార్డు సమం చేసిన విద్య ఈసారి 01.51 సెకన్ల కంటే తక్కువ టైమింగ్‌లోనే హర్డిల్స్‌ను దాటింది. దాంతో.. మరోమారు పోడియం మీద సగర్వంగా కాంస్య పతకాన్ని స్వీకరించింది విద్య. యూఏఈకి చెందిన మరియం కరీం పసిడి, అడెలినా జెమ్స్(కజకిస్థాన్) రజతం గెలుపొందారు.
A NEW CHAPTER IN INDIAN ATHLETICS! 🇮🇳🥉
Vithya Ramraj wins Bronze in the Women’s 400m Hurdles at #AsianGames2026, shattering legendary PT Usha’s National Record in the process! A historic run that makes the nation proud.#Cheer4Bharat pic.twitter.com/IXCntDOoTH
— Dr Mansukh Mandaviya (@mansukhmandviya) September 28, 2026