మహదేవపూర్ మండలంలోని బీరసాగర్, అన్నారం అడవుల్లో, కాటారం మండలం గుండ్రాత్పల్లి గ్రామ శివారులో పులి సంచరిస్తున్నదనే సమాచారంతో అటవీ శాఖ అధికారులు గాలింపు చర్యలు చేపట్టినా దాని జాడ తెలియడం లేదు.
కొద్ది రోజులుగా కాగజ్నగర్ అడవులతో పాటు సిర్పూర్-టీ-మహారాష్ట్ర సరిహద్దుల్లో బెబ్బులి సంచరిస్తున్నది. అక్కడక్కడే రోడ్లపై.. పంట చేలల్లో తిరుగుతూ ప్రజలు, వాహనదారులను బెంబేలెత్తిస్తున్నది.
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పులి (Tiger) సంచారం కలకలం సృష్టిస్తున్నది. గత కొన్నిరోజులుగా పశువుల మందలపై దాడులు చేస్తున్న పులి.. శుక్రవారం ఉదయం ఓ యువతిని చంపేసింది. కాగజ్నగర్ మండలం గన్నారంలో ఉదయం 8.30 గంటల సమ�