మంచిర్యాల : మంచిర్యాల(Mancherial )జిల్లాలో పులి సంచారం(Tiger roaming) కలకలం రేపుతున్నది. తాజాగా బెల్లంపల్లి మండలం కన్నాల శివారు శ్రీ బుగ్గరాజరాజేశ్వర స్వామి ఆలయ రోడ్డు వైపు పులి సంచరిస్తున్నట్లు ఎఫ్ఆర్ఓ పూర్ణచందర్ తెలిపారు. పులి అడుగులు గుర్తులను గ్రామస్తులు చూసినట్లు ఆయన వెల్లడించారు. కావున వ్యవసాయదారులు చీకటి పడకముందే ఇండ్లకు చేరుకోవాలని సూచించారు. ఒక్కరుగా కాకుండా గుంపులుగా వెళ్లాలన్నారు. కాగా, పులి ఎప్పుడు ఎవరిపై దాడి చేస్తుందేమోనని గ్రామస్తులు భయంభయంగా గడుపుతున్నారు. అటవీ శాఖ అధికారులు త్వరగా పులిని బంధించాలని కోరుతున్నారు.
ఇవి కూడా చదవండి..