Balakrishna Padma Bushan | తెలుగు నటుడు నందమూరి బాలకృష్ణకు అరుదైన గౌరవం దక్కిన విషయం తెలిసిందే. రిపబ్లిక్ డే సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఆయనకు పద్మభూషణ్ అవార్డు ప్రకటించింది. సినీ రంగంలో ఆయన చేసిన కృషికి గాను బాలయ్యను కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డుతో సత్కరించింది. ఇక బాలయ్యకు పద్మా రావడంతో సినీ ప్రముఖులు ఆయనకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు విషెస్ తెలుపుతున్నారు. అయితే పద్మా అవార్డుని ప్రకటించడంపై బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ట్రస్ట్ యాజమాన్యం బాలకృష్ణని సత్కరించింది.
ఈ సందర్భంగా బాలయ్య మాట్లాడుతూ.. నాకు పద్మభూషణ్ రావడం అంటే అది నా చలన చిత్ర పరిశ్రమకు రావడమే. నా హిందూపూర్ ప్రజలకు రావడమే, బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ కు రావడమే అంటూ బాలకృష్ణ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. గత నాలుగు సినిమాలు హిట్ అవ్వడం.. ఆన్స్టాపబుల్ షోతో రీ ఎంట్రీ ఇవ్వడం.. ఇప్పుడు పద్మా అవార్డు కూడా రావడంతో బాలయ్య మరో మెట్టు ఎక్కేశాడు అంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా కొందరు అయితే బాలకృష్ణకి పద్మభూషణ్ రావడం ఆలస్యం అయ్యింది అన్నారు. వాళ్లకి ఒకటే చెప్పాను. నేను ఎప్పుడు వాటి గురించి పట్టించుకోలేదు. నా పనే నాకు దైవం అంటూ బాలయ్య చెప్పుకోచ్చాడు.