మహాదేవపూర్ : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండల పరిధిలోని పలుగుల ఎస్సీ కాలనీలో పులి సంచారం(Tiger roaming )కలకలం రేపింది. ఓ లారీ డ్రైవర్ పులిని చూసి భయంతో పరుగులు తీశాడు. వెంటనే సమాచారాన్ని గ్రామస్తులకు తెలిపాడు. విషయం తెలుసుకున్న అటవీశాఖ అధికారులు పులి జాడ కోసం నాలుగు బృందాలుగా ఏర్పడి అన్వేషిస్తున్నారు.
సమీప గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. గ్రామంలో పులి సంచిరిస్తుండటంతో ఎప్పుడు ఎవరిపై దాడి చేస్తుందేమోనని ప్రజలు తీవ్ర భయాందోళన గురవుతున్నారు. అటవీ శాఖ అధికారులు స్పందించి పులిని బంధించాలని కోరుతున్నారు.
ఇవి కూడా చదవండి..
Prabhas Spirit | ప్రభాస్ స్పిరిట్ కోసం సందీప్ వంగా కండిషన్స్.!
Ketika Sharma | క్యూట్ క్యూట్ ఫోజులతో కేతిక శర్మ అరాచకం..
Delhi CM | ఢిల్లీ సీఎంగా ఆ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి.. రేసులో ఉన్నది వీళ్లే..