Delhi CM | ఢిల్లీ ముఖ్యమంత్రి (Delhi CM) పదవిని ఎవరు అధిష్ఠిస్తారన్న సస్పెన్స్ కొనసాగుతోంది. ఈ ఉత్కంఠకు మరికాసేపట్లో తెరపడనుంది. బీజేపీ శాసన సభాపక్షం తమ నేతను నేడు ఎంపిక చేసుకోనుంది. రాత్రి 7 గంటలకు సమావేశం అనంతరం ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరన్నది ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. ఇక రేపు సీఎం ప్రమాణ స్వీకారం (Delhi Oath) ఉంటుందని సమచారం.
అయితే, తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఢిల్లీ కొత్త సీఎం బనియా సామాజికవర్గానికి (Baniya community) చెందిన వ్యక్తి కావొచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. రాజధానిలో ప్రభుత్వాన్ని నడిపించేందుకు బనియా సామాజికవర్గానికి చెందిన నేతను పార్టీ ఎన్నుకునే అవకాశం ఉన్నట్లు తెలిసింది. ఇదే నిజమైతే సీఎం పదవికి పోటి పడుతున్న వారిలో బనియా సామాజికవర్గానికి చెందిన విజేందర్ గుప్తా (Vijender Gupta), రేఖా గుప్తా (Rekha Gupta), జితేందర్ మహాజన్ (Jitender Mahajan) ముందు వరుసలో ఉన్నారు.
విజేందర్ గుప్తా.. బీజేపీ సీనియర్ నాయకుడు. పార్టీ ఢిల్లీ విభాగానికి అధ్యక్షుడిగా పనిచేసిన అనుభవం. ప్రస్తుతం రోహిణి స్థానంలో గెలుపొందారు. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ఆధిపత్యం ఉన్నప్పటికీ 2015, 2020 రెండుసార్లూ విజయం సాధించారు. అంతేకాదు ఢిల్లీ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా కూడా పనిచేశారు. ఆయన అనుభవం, స్థితిస్థాపకతతో పార్టీ నాయకత్వ వ్యూహంలో కీలక వ్యక్తిగా ఉన్నారు.
రేఖా గుప్తా.. ఇక షాలిమార్ బాగ్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన బనియా సామాజిక వర్గానికి చెందిన నాయకురాలు రేఖా గుప్తా కూడా సీఎం రేసులో ఉన్నారు. ఢిల్లీ మేయర్‌గా పనిచేసిన రేఖా గుప్తా పేరు కూడా పార్టీ వర్గాల్లో ఎక్కువగా వినపడుతున్నది. ప్రస్తుత బీజేపీలో ఎవరూ మహిళా సీఎం లేకపోవటం ఆమెకు కలిసివచ్చే అంశమని చెబుతున్నారు.
జితేంద్ర మహాజన్.. ఆర్ఎస్ఎస్తో బలమైన సంబంధాలు ఉన్న బనియా సామాజిక వర్గానికి చెందిన జితేంద్ర మహాజన్ పేరు కూడా తెరపైకి వచ్చింది. రోహ్తాస్ నగర్ అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి మూడోసారి ఆయన విజయం సాధించారు. జాతీయ నాయకులతో కూడా అత్యంత సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నారు.
Also Read..
Delhi Oath | రేపే ఢిల్లీ సీఎం ప్రమాణం.. గెస్ట్ లిస్ట్‌లో గిగ్ వర్కర్లు, ఆటో డ్రైవర్లు, రైతులు..
Maha kumbh | ఆ నీళ్లు తాగేందుకూ అనుకూలమే.. విసర్జితాలతో నది కాలుష్యం ఆరోపణలను ఖండించిన యూపీ సీఎం
Ayodhya | మహాకుంభమేళా ఎఫెక్ట్.. అయోధ్య రామమందిరం నిర్మాణ పనులకు బ్రేక్