Delhi Oath | ఢిల్లీ ముఖ్యమంత్రి పదవిని ఎవరు అధిష్ఠిస్తారన్న సస్పెన్స్‌కు మరికాసేపట్లో తెరపడనుంది. బీజేపీ శాసన సభాపక్షం తమ నేతను నేడు ఎంపిక చేసుకోనుంది. ఈ సమావేశం అనంతరం ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరన్నది సాయంత్రంలోపు ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. ఇక రేపు సీఎం ప్రమాణ స్వీకారం (Delhi Oath) ఉంటుందని సమచారం. ఢిల్లీలోని రామ్‌లీలా మైదానం (Ramlila Maidan)లో ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార ఉత్సవానికి అధికారులు చకచకా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు, ఇతర ప్రముఖుల సమక్షంలో జరిగే ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి సహా మంత్రివర్గ మంతా ప్రమాణ స్వీకారం చేస్తుందని అధికార వర్గాలు తెలిపాయి.
ఇక ఈ కార్యక్రమానికి బీజేపీ గెస్ట్ లిస్ట్‌లో గిగ్ వర్కర్లు, క్యాబ్ డ్రైవర్, ఆటో రిక్షా డ్రైవర్లు (Auto Drivers), రైతులు, జుగ్గీస్ ఉన్నట్లు సమాచారం. అంతేకాకుండా సంక్షేమ పథకాల లబ్ధిదారును కూడా ఆహ్వానించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. వీరితోపాటు 50 మందికిపైగా సినీ తారలు, పారిశ్రామిక వేత్తలు, దౌత్యవేత్తలకు సైతం ఆహ్వానాలు పంపినట్లు పేర్కొన్నాయి. గత ముఖ్యమంత్రులు, ఆప్ నేతలు అరవింద్ కేజ్రీవాల్, అతిషి, కాంగ్రెస్ ఢిల్లీ యూనిట్ చీఫ్ దేవేందర్ యాదవ్‌ని కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించినట్లు తెలిసింది. రామ్‌లీలా మైదాన్‌లో జరిగే ఈ ప్రమాణస్వీకార కార్యక్రమం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12.34 గంటల వరకు కొనసాగుతుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. మధ్యాహ్నం 12.05 గంటలకు సీఎం ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
#WATCH | Preparations underway at Ramlila Maidan ahead of the oath ceremony of the new CM of Delhi.
BJP Legislature Party meeting will be held today. The swearing-in ceremony will be held tomorrow, 20th February pic.twitter.com/k7Kr1Dictm
— ANI (@ANI) February 19, 2025
Also Read..
Mahayuti | మహాయుతి కూటమిలో విభేదాలు.. ఏక్నాథ్ షిండే ఏమన్నారంటే..?
Gyanesh Kumar | దేశ నిర్మాణంలో మొదటి అడుగు ఓటే.. సీఈసీగా బాధ్యతలు చేపట్టిన జ్ఞానేశ్ కుమార్
Maha Kumbh: మహాకుంభ్ తేదీలను పొడిగించడం లేదు.. స్పష్టం చేసిన ప్రయాగ్‌రాజ్ జిల్లా మెజిస్ట్రేట్