Ayodhya | ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ (Prayagraj)లో జరుగుతున్న మహాకుంభమేళా వేళ అయోధ్యకు భక్తుల తాకిడి పెరిగింది. ప్రయాగ్‌రాజ్ వచ్చిన భక్తులు రామ్‌లల్లా దర్శనం కోసం అట్నుంచి అటు అయోధ్య వెళ్తున్నారు. దీంతో అయోధ్యా నగరిలో భక్తుల రద్దీ నెలకొంటోంది. రోజూ లక్షల్లో భక్తులు అయోధ్య వస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.
#WATCH | Ayodhya, UP | Devotees throng Ayodhya to offer prayers at Ram Janmbhoomi Temple. pic.twitter.com/GB7GhjBoRS
— ANI (@ANI) February 19, 2025
ఇక భక్తుల తాకిడి పెరగడంతో రామమందిరం నిర్మాణ పనులు ఆగిపోయినట్లు నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా తెలిపారు. కుంభమేళా ఎఫెక్ట్‌తో గత 25 రోజులుగా పనులు ఆగిపోయినట్లు చెప్పారు (Ram Temple constructions work). మార్చి నెలలో పూర్తి కావాల్సిన పనులు జూన్ నాటికి అవుతాయని వెల్లడించారు.
#WATCH | UP | Devotees throng Ayodhya to offer prayers at Shri Ram Janmbhoomi Temple. After taking a holy dip at #MahaKumbh2025, devotees have been coming to Ayodhya for the darshan of Ram Lalla. pic.twitter.com/BFqwnhEre9
— ANI (@ANI) February 19, 2025
‘ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళా కారణంగా రామమందిర నిర్మాణ పనులకు బ్రేక్ పడింది. మహాకుంభస్నానం తర్వాత లక్షలాది మంది భక్తులు అయోధ్యకు చేరుకుంటున్నారు. ప్రతిరోజూ రెండు లక్షల మందికి పైగా భక్తులు రామ్‌లాలా దర్శనం చేసుకుంటున్నారు. భక్తుల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నాం. అందుకే భక్తుల భద్రతను దృష్టిలో పెట్టుకొని కొన్ని పనులు నిలిపివేయాల్సి వచ్చింది’ అని ఆయన తెలిపారు.
#WATCH | Prayagraj, UP | Drone visuals of #MahaKumbh2025 Mela Kshetra as devotees gather at the Triveni Sangam for a holy dip. pic.twitter.com/lYNEieezYT
— ANI (@ANI) February 19, 2025
Also Read..
Delhi Oath | రేపే ఢిల్లీ సీఎం ప్రమాణం.. గెస్ట్ లిస్ట్‌లో గిగ్ వర్కర్లు, ఆటో డ్రైవర్లు, రైతులు..
Maha Kumbh: మహాకుంభ్ తేదీలను పొడిగించడం లేదు.. స్పష్టం చేసిన ప్రయాగ్‌రాజ్ జిల్లా మెజిస్ట్రేట్
Mahayuti | మహాయుతి కూటమిలో విభేదాలు.. ఏక్నాథ్ షిండే ఏమన్నారంటే..?