Spirit Movie | అగ్ర కథానాయకుడు ప్రభాస్, అర్జున్ రెడ్డి, యానిమల్ చిత్రాల దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా కాంబోలో రాబోతున్న భారీ బడ్జెట్ చిత్రం ‘స్పిరిట్’(Spirit). దాదాపు రూ. 300 కోట్లకు పైగా బడ్జెట్‌తో రానున్న ఈ మూవీని టీ సిరీస్, భద్రకాళి పిక్చర్స్ నిర్మించనున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రోడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం నుంచి అప్డేట్స్ కోసం ప్రభాస్ అభిమానులంతా కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ చిత్రం ఈ ఏడాది సమ్మర్లో సెట్స్ మీదకి వెళ్లనున్నట్లు టాక్ నడుస్తుంది. ఇదిలావుంటే ఈ సినిమా కోసం దర్శకుడు సందీప్ వంగా నటినటులందరికి కండిషన్స్ పెట్టబోతున్నట్లు తెలుస్తుంది.
ఇప్పటికే రాజమౌళి ఎస్ఎస్ఎంబీ ప్రాజెక్ట్ కోసం చిత్రబృందానికి కండిషన్స్ పెట్టిన విషయం తెలిసిందే. రాజమౌళి సినిమా కంప్లీట్ అయ్యేంతవరకు మూవీకి సంబంధించిన ఎటువంటి అప్డేట్లను బయటపెట్టడానికి వీల్లేదంటూ బాండ్ కూడా రాయించుకున్నాడు రాజమౌళి. అయితే ఇదే పనిని ఇప్పుడు సందీప్ కూడా చేయబోతున్నట్లు తెలుస్తుంది. ప్రభాస్‌తో తెరకెక్కించబోతున్న సినిమాకి సందీప్ కండిషన్స్ పెట్టబోతున్నట్లు తెలుస్తుంది. ఇందులో భాగంగానే సినిమాలో నటించే నటినటులతో పాటు హీరో హీరోయిన్లకి కూడా ఎటువంటి అప్డేట్స్ బయటపెట్టవద్దని బాండ్ రాసుకోబోతున్నట్లు తెలుస్తుంది. అలాగే ఈ సినిమాలో ప్రభాస్ లుక్‌కి సంబంధించి కూడా సందీప్ కండిషన్స్ పెట్టబోతున్నట్లు తెలుస్తుంది. మూవీలో ప్రభాస్ లుక్ కీలకం అని.. ఒకవేళ సినిమా షూటింగ్ మధ్యలో లుక్ మార్చుకున్న సినిమాకి ఎఫెక్ట్ పడుతుందని అందుకనే ఏది మార్చకుండా సినిమా అయ్యేవరకు ప్రభాస్ అలానే ఉండలాని సందీప్ ఆలోచిస్తున్నట్లు సమాచారం.