హాజీపూర్, ఫిబ్రవరి 27 : మండలంలోని గుడిపేట, నంనూర్, ముల్కల్ల గ్రామ పంచాయతీ శివారులోని అటవీ ప్రాంతాల్లో పెద్దపులి సంచరిస్తున్నట్లు అటవీ శాఖ అధికారులు గురువారం తెలిపారు. ఆయా గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.
అంతేగాకుండా మేకలు, పశువుల కాపరులు అటవీ వైపు వెళ్లవద్దని, కరెంటు తీగలు వేయరాదని హెచ్చరించారు.