కరోనా సంక్షోభం, ఆర్థిక మాంద్యం పేరిట టెక్ కంపెనీల్లో మొదలైన ఉద్యోగాల కోత ఇంకా కొనసాగుతున్నది. ఈ ఏడాది తొలి ఆరు నెలల్లోనే ఏకంగా లక్ష మందికి పైగా ఉద్యోగులకు సాఫ్ట్వేర్ కంపెనీలు ఉద్వాసన పలికాయి.
ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ సంస్థల్లో ఉద్యోగాల ఊచకోత 2023లోనూ కొనసాగనున్నది. గత నవంబర్లో 11వేల మంది ఉద్యోగులను ఇంటికి పంపించిన ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ ఈ ఏడాది కూడా వేటు వేసేందుకు సిద్ధమవుతున్నది.