(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, జూలై 3 (నమస్తే తెలంగాణ): కరోనా సంక్షోభం, ఆర్థిక మాంద్యం పేరిట టెక్ కంపెనీల్లో మొదలైన ఉద్యోగాల కోత ఇంకా కొనసాగుతున్నది. ఈ ఏడాది తొలి ఆరు నెలల్లోనే ఏకంగా లక్ష మందికి పైగా ఉద్యోగులకు సాఫ్ట్వేర్ కంపెనీలు ఉద్వాసన పలికాయి.
10 మంది ఉద్యోగులు ఉన్న చిన్న స్టార్టప్ కంపెనీ నుంచి 16 లక్షల మంది ఉద్యోగులు ఉన్న అమెజాన్ వరకూ ఇలా ప్రతీ కంపెనీ ఉద్యోగులకు పింక్ స్లిప్ ఇచ్చి ఇంటికి పంపిస్తుండటం పారిశ్రామికవర్గాల్లో కలకలం సృష్టిస్తున్నది. ఈ ట్రెండ్ ఇలాగే కొనసాగితే ఆర్థిక, సామాజిక, పారిశ్రామిక రంగాల్లో పెను మార్పులు చోటుచేసుకొనే ప్రమాదం ఉన్నదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.