న్యూఢిల్లీ: కొత్త ఏడాది ప్రారంభమై రెండు నెలలు కూడా పూర్తి కాకుండానే ఈ 40 రోజుల వ్యవధిలో ప్రపంచ వ్యాప్తంగా 30 వేల మంది ఉద్యోగులను కంపెనీలు వీధిన పడేశాయి. ఆన్లైన్ రిటైల్ దిగ్గజం అమెజాన్ జనవరి తర్వాత అధికంగా 16,000 మందిని ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నట్టు ప్రకటించింది.
సేల్స్‌ఫోర్స్, మెటా, వర్క్‌డే, ఆటోడెస్క్, పింట్రెస్ట్, ఎక్స్పిడియా, జిల్లో, ఎరిక్సన్, ఏఎస్ఎంఎల్ లాంటి సంస్థలు కూడా వందలాది మంది సిబ్బందిని తొలగించినట్టు లేఆఫ్స్.ఎఫ్‌వైఐ తెలిపింది. అలాగే చిన్నచిన్న సంస్థలు కూడా తమ సిబ్బందిని తగ్గించే పనిలో పడ్డాయి.