తిమ్మాపూర్, సెప్టెంబర్29: తిమ్మాపూర్ మండలం వ్యాప్తంగా సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆడబిడ్డలు తీరొక్క పూలతో చక్కగా పేర్చిన బతుకమ్మలతో ఆడిపాడారు.
కాసిపేట, సెప్టెంబర్ 28 : బతుకమ్మ పండుగ వేళ రాత్రిపూట పలు గ్రామాల్లో వీధి దీపాలు (Street Lights) వెలగడం లేదు. మాజీ ఉప సర్పంచ్, బీఆర్ఎస్ నాయకులు బోయిని తిరుపతి (Boini Tirupati) సొంత ఖర్చులతో లైట్స్ ఏర్పాటు చేయించారు.
పితృ అమావాస్య రోజు ఎంగిలిపూలతో మొదలైన బతుకమ్మ వేడుకలు గురువారం సద్దులతో ముగిశాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎనిమిది రోజుల పాటు కొనసాగిన పూల జాతర గౌరమ్మను గంగమ్మ ఒడికి సాగనంపడంతో పరిసమాప్తమైంది.
రాజన్న క్షేత్రం పులకించిపోయింది. మహిళల బతుకమ్మ ఆటపాటలతో మార్మోగింది. ఆనవాయితీ ప్రకారం ఏడు రోజులకు నిర్వహించిన సద్దుల బతుకమ్మ సంబురం అంబరాన్నంటింది. ఆడబిడ్డల సందడితో మూలవాగు మురిసిపోయింది.
రంగు రంగుల పుష్పాలతో వీధులన్ని హరివిల్లులయ్యాయి.. బతుకమ్మలో ఒద్దికగా ఒదిగిన తంగేడు పూలు తరించాయి. కలువ పూలు కనువిందు చేశాయి. గులాబీ పూలు గుబాళించాయి. మందారాలు మరింత ఎర్రబడ్డాయి.. కట్ల పూలు కళకళలాడాయి.. సొర,