అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు
రంగు రంగుల పుష్పాలతో వీధులన్ని హరివిల్లులయ్యాయి.. బతుకమ్మలో ఒద్దికగా ఒదిగిన తంగేడు పూలు తరించాయి. కలువ పూలు కనువిందు చేశాయి. గులాబీ పూలు గుబాళించాయి. మందారాలు మరింత ఎర్రబడ్డాయి.. కట్ల పూలు కళకళలాడాయి.. సొర, చామంతి పూలు పరిమళాలు పంచాయి.. గోగు పూలు సంబురపడ్డాయి.. ముద్ద బంతులు మురిశాయి.. వెరసి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సోమవారం సద్దుల బతుకమ్మ వేడుకలు అంబరాన్నంటాయి.. గునుగు, సీత జడ పూలు సిగు ్గపడుతుంటే నందివర్థనాలు తెలుపు కాంతులను వెదజల్లాయి..
ఖమ్మం కల్చరల్. అక్టోబర్3 : రంగు రంగుల పుష్పాలతో వీధులన్ని హరివిల్లులయ్యాయి.. బతుకమ్మలో ఒద్దికగా ఒదిగిన తంగేడు పూలు తరించాయి. కలువ పూలు కనువిందు చేశాయి. గులాబీ పూలు గుబాళించాయి. మందారాలు మరింత ఎర్రబడ్డాయి.. కట్ల పూలు కళకళలాడాయి.. సొర, చామంతి పూలు పరిమళాలు పంచాయి.. గోగు పూలు సంబురపడ్డాయి.. ముద్ద బంతులు మురిశాయి.. వెరసి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సోమవారం సద్దుల బతుకమ్మ వేడుకలు అంబరాన్నంటాయి.. గునుగు, సీత జడ పూలు సిగు ్గపడుతుంటే నందివర్థనాలు తెలుపు కాంతులను వెదజల్లాయి.. మహిళలు పెరుగన్నం, సజ్జముద్దలు, ఎండు కొబ్బరి అన్నం, పులిహోర, చపాతి ముద్దలు, బియ్యం, నువ్వులను గౌరమ్మకు నైవేద్యంగా సమర్పించారు. అనంతరం నదులు, వాగులు, చెరువుల్లో గౌరమ్మను గంగమ్మ ఒడికి చేర్చారు..
సంబురంగా సద్దుల బతుకమ్మ
బతుకమ్మ పండుగ పురస్కరించుకొని సోమవారం చివరి రోజు మధిర, పాలేరు నియోజకవర్గాల్లో శనివారం బతుకమ్మ వేడుకలను నిర్వహించారు. తొమ్మిదో రోజు సద్దుల బతుకమ్మకు అయిదు రకాల సద్దులు ఫలహారం ఇస్తారు. పెరుగన్నం, చింతపండు పులిహోర, సద్ది, నిమ్మకాయల పులిహోర, కొబ్బరి తురుము, నువ్వుల పొడి కలిపిన సద్ది ఫలహారంగా నైవేద్యం సమర్పించారు. సద్దుల బతుకమ్మను మహిళలు, యు వతులు, చిన్నారులు రంగు రంగుల పూలతో తయారు చేసి, ఒకచోట ఉంచి ఆడి పాడారు. పెద్ద పెద్ద బతుకమ్మలను తయారు చేసి గ్రామాల్లో ట్రాక్టర్లపై ఊరేగించారు. అనంతరం మేళతాళాలతో ఊరేగింపుగా బతుకమ్మలను చెరువుల్లో, కాలువల్లో నిమజ్జనం చేశారు.
ఖమ్మం నగరంలో అంబరాన్నంటిన సంబురాలు
ఖమ్మం నగరంలో సద్దుల బతుకమ్మ సంబురాలు సోమవారం అంబరాన్నంటాయి. వీధులన్నీ బతుకమ్మ ఆటపాటలతో మారుమ్రోగాయి. ఉదయం నుంచే ఆడబిడ్డలు ఎంతో ఓర్పుగా తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చారు. ఖమ్మం మార్కెట్ కమిటీ చైర్పర్సన్ డౌలే లక్ష్మీప్రసన్న తయారు చేయించిన మహాశక్తి స్వరూపిణీ బతుకమ్మ నగరవాసులను ఎంతగానో ఆకట్టుకుంది. సాయంత్రం బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో.. బంగారు గౌరమ్మ ఉయ్యాలోఅంటూ గౌరమ్మ తల్లి పోయిరావమ్మా.. అంటూ బతుకమ్మలను గంగ ఒడికి వైభవంగా సాగనంపారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
US-Iran | అమెరికన్ల హత్యకు ఇరాన్ కుట్ర.. మిడిల్ ఈస్ట్‌లో యూస్ రాయబార సిబ్బందికి హై అలర్ట్
కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలి : ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం
అంజనాపురంలో పట్టపగలే భారీ చోరీ
Emergency Alert | యూకేలో ఎమర్జెన్సీ అలర్ట్.. మూడు రోజులకు సరుకులు ఉంచుకోవాలన్న సర్కారు..!
‘రైతులు భూసార పరీక్షలు చేయించుకోవాలి’
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

