నిజామాబాద్ : పూలను పూజించి, ప్రకృతిని ప్రేమించే గొప్ప పండుగ బతుకమ్మ. తెలంగాణ ఆడబిడ్డలు సంబురంగా జరుపుకునే బతుకమ్మ ఉత్సవాల్లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఉత్సాహంగా పాల్గొని ఆడిపాడారు. బుధవారం నిజామాబాద్ నగరంలో తన స్వగృహంలో ఎమ్మెల్సీ కవిత కుటుంబ సభ్యులతో కలిసి సద్దుల బతుకమ్మలో పాల్గొన్నారు.
అంతకుముందు జిల్లా కలెక్టర్ సతీమణి మనీషా, పోలీస్ కమిషనర్ సతీమణి, అదనపు కలెక్టర్ చిత్ర మిశ్రా, మేయర్ నీతు కిరణ్ లతో కలిసి బతుకమ్మలను అందంగా తీర్చిదిద్దారు. హౌసింగ్ బోర్డు కాలనీలోని మైదానంలో కాలనీ మహిళలతో కలిసి బతుకమ్మ పాటలు పాడుతూ ఎమ్మెల్సీ కవిత ఉత్సాహంగా బతుకమ్మ ఆడారు.
నిజామాబాద్ నగరంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తన స్వగృహంలో కుటుంబ సభ్యులతో కలిసి సద్దుల బతుకమ్మలో పాల్గొన్నారు. @RaoKavitha #Bathukamma #SaddulaBathukamma pic.twitter.com/J4s1asSaWz
— Namasthe Telangana (@ntdailyonline) October 13, 2021
ఇవి కూడా చదవండి..
Crime news |కుంటలో పడి యువకుడు మృతి
టీమిండియాకు విదేశీ కోచ్.. చాన్సే లేదంటున్న బీసీసీఐ!
వినూత్నంగా బర్త్డే సెలబ్రేషన్.. 550 కేక్స్ కట్ చేసిన వ్యక్తి