ముంబై: ఒక వ్యక్తి తన పుట్టిన రోజును వినూత్నంగా సెలబ్రేట్ చేసుకున్నాడు. ఏకంగా 550 కేకులు కట్ చేశారు. మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఈ ఘటన జరిగింది. సూర్య రాటూరి అనే వ్యక్తి తన పుట్టిన రోజును వెరైటీగా జరుపుకోవాలని భావించాడు. దీంతో మూడు టేబుల్స్‌పై ఉంచిన 550 రకాల కేకులను రెండు చేతుల్లో ఉన్న చాకులతో వరుసగా కట్ చేశాడు. ఆయన స్నేహితులు, బంధువులు చప్పట్లతో అతడ్ని అభినందించారు. చాలా మంది తమ మొబైల్ ఫోన్లతో దీనిని వీడియో తీసేందుకు పోటీ పడ్డారు. ముంబైలోని కాండివలి రైల్వే స్టేషన్ సమీపంలో జరిగిన ఈ బర్త్ డే సెలబ్రేషన్‌కు చెందిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.