e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, October 21, 2021
Home News మూసీపై ఈనాడు నానాయాగి.. సుందరీకరణపై విషపు రాతలు

మూసీపై ఈనాడు నానాయాగి.. సుందరీకరణపై విషపు రాతలు

eenadu news paper fake news on hyderabad musi river | మూసీ నది | eenadu | eenadu.net
Musi River | మూసీపై ఈనాడు నానాయాగి.. సుందరీకరణపై విషపు రాతలు

Musi River | 60 ఏండ్ల పాపాలు..ఐదేండ్లలో పోతాయా ? మూసీ పరిరక్షణ, పునరుద్ధరణకు ప్రభుత్వం ఓ వైపు పక్కా ప్రణాళికతో పకడ్బందీ చర్యలు తీసుకుంటుంటే ఓర్వలేని రాతలు..దుర్గంధం అంటూ విషం. పాఠకుల దృష్టి మరల్చేందుకు పన్నాగం. ఉమ్మడి రాష్ట్రంలో మూసీ ప్రక్షాళన పేరుతో వేల కోట్లు ఖర్చు చేస్తే మురిసిందట. ఐదేండ్లలో తెలంగాణ ప్రభుత్వం ఖర్చు చేసిన రూ.80 కోట్ల నిధులు దుర్వినియోగమై పరివాహకంలో దుర్గంధం వ్యాపిస్తుందట. గుజరాత్‌లోని సబర్మతి నదిలా మూసీని సుందరంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం రోడ్‌మ్యాప్‌ రూపొందించి, ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తుంది. ప్రధానంగా కాళేశ్వర జలాలతో మూసీ సుందరీకరణ ప్రారంభించింది. ఇవన్నీ పట్టించుకోకుండా మూసీపై ఈనాడు ( eenadu ) అక్కసు వెళ్లగక్కింది. ‘నది పరిరక్షణా…నిధులు భక్షణా’ అంటూ తన అవగాహనలేమిని బయటపెట్టుకుంది.

సబర్మతి రివర్‌ఫ్రంట్‌ పనులు పట్టాలెక్కేందుకే ఐదు దశాబ్దాలకుపైగా సమయం పట్టిందనే ధ్యాస లేకుండా…సీఎం కేసీఆర్‌ హామీ ఇచ్చి ఐదేండ్లయినా మూసీ ఇంకా బాగుపడలేదంటూ మొసలికన్నీరు కారుస్తున్నది. అంతెందుకు కేవలం ఎకరంన్నర భూమి కోసం ఔటర్‌రింగు రోడ్డు నిర్మాణ సమయంలో ‘ ఈనాడు ( eenadu ) ’ చేసిన అక్షర యాగీలో కనీసం ఐదోవంతు మూసీ బాగు కోసం లిఖించినా ప్రజలకు ఎంతో మేలు జరిగేది.

ఏండ్ల తరబడి నిర్లక్ష్యం

- Advertisement -

ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్‌ను కేవలం వాణిజ్య వస్తువుగా భావించిన అప్పటి పాలకులు చారిత్రక మూసీని గాలికొదిలేశారు. 2007లో గ్రేటర్‌ హైదరాబాద్‌ ఆవిర్భవించినప్పటికీ 2014 వరకు నిజాం కాలం నాటి డ్రైనేజీ వ్యవస్థే దిక్కు. ఆవాసాల నుంచి వచ్చే మురుగునీటిని శుద్ధి చేయకుండా మూసీలోకి వదలడంతోపాటు దశాబ్దాలపాటు కబ్జా, పారిశ్రామిక వ్యర్థాల పారబోతకు కేంద్రమైన మూసీ పరివాహకాన్ని ఏనాడూ పట్టించుకున్న దాఖలాలు లేవు. గత కొన్నేండ్లుగా మంచి వర్షాలతో మూసీ జలాలను నగరవాసులు చూస్తున్నామేగానీ… ఎగువన పరివాహకంలోని ఆక్రమణలు, అడ్డుగా నిర్మించిన చెక్‌డ్యాంలతో ఏండ్ల తరబడి నదీ మార్గంలో మురుగు తప్ప వరద పారలేదు.

ఆరంభమైందో లేదో..అప్పుడే భక్షణా ?

‘ ఈనాడు ( eenadu ) ’ తన కథనంలో ఆరు దశాబ్దాలుగా జరుగుతున్న విషయాన్నే చెప్పింది. పలుచోట్ల వ్యర్థాలు పారబోస్తున్నట్లుగా రాసింది. నిజానికి మూసీ సుందరీకరణకు ప్రభుత్వం తలపెట్టిన బృహత్తర ప్రాజెక్టు ఇంకా పూర్తికాలేదు. ఇప్పటికీ ఆరంభదశలోనే ఉంది. కొన్నిచోట్ల వ్యర్థాలను పారబోసినంత మాత్రాన వెచ్చించిన నిధులు భక్షణకే అన్నట్లు కట్టుకథలు అల్లడం విజ్ఞులైన పాఠకులను గందరగోళంలోకి నెట్టడమే.

ఆ కళ వచ్చేందుకు 50 ఏండ్లు పట్టింది..

 • ఈనాడు ’ కీర్తించిన గుజరాత్‌ సబర్మతి నది అభివృద్ధి ఏడాదిలోనో.. రెండేండ్లలోనో జరిగింది కాదు. అర శతాబ్దంపైనే పట్టింది. ఇవేమీ పట్టించుకోని ఆ పత్రిక మూసీ కబ్జా అవుతోందని, మురికి కూపమని, దుర్గంధమంటూ పాఠకుల మెదల్లోకి విషాన్ని ఎక్కిస్తోంది.
 • 1961లో ఫ్రెంచ్‌ ఆర్టిటెక్ట్‌ బెర్నర్డ్‌ కోన్‌ 74 ఎకరాల్లో ‘ఇంటిగ్రేటెడ్‌ ప్లానింగ్‌, డెవలప్‌మెంట్‌ ఆఫ్‌ సబర్మతి రివర్‌ఫ్రంట్‌’ ప్రతిపాదనలు రూపొందిస్తే..1966లో గుజరాత్‌ ప్రభుత్వం ఆ ప్రతిపాదనల సాధ్యాసాధ్యాలను పరిశీలించింది.
 • 1992లో నదిలోకి మురుగునీరు చేరకుండా శుద్ధి కేంద్రాలు నిర్మించాలని 1992లో మరో నివేదిక తయారైంది.
 • ఇందుకోసం అహ్మదాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (ఏఎంసీ) సబర్మతి రివర్‌ఫ్రంట్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఎస్‌ఆర్‌ఎఫ్‌డీసీఎల్‌) పేరిట స్పెషల్‌ వెహికల్‌ను ఏర్పాటు చేయగా… 1997 మేలో అప్పటి కేంద్ర ప్రభుత్వం కోటి రూపాయలతో సీడ్‌ క్యాపిటల్‌ను మంజూరు చేసింది.
 • సుభాష్‌ బ్రిడ్జి నుంచి వస్నా బరాజ్‌ వరకు 10.4 కిలోమీటర్ల మేర అభివృద్ధికి 1998లో మరో నివేదిక తయారు చేశారు. రూ.1200 కోట్ల అంచనా వ్యయంతో 501.1 ఎకరాలను అభివృద్ధి చేసేందుకు ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. ఇందుకయ్యే నిధుల సమీకరణకు నివాస, వాణిజ్య సముదాయాలకు భూములను విక్రయించారు.
 • 2005లో బీమల్‌ పటేల్‌-హెచ్‌సీపీ డిజైన్‌ ప్లానింగ్‌ అండ్‌ ప్రైవేటు లిమిటెడ్‌ సంయుక్తంగా 2005లో సబర్మతి రివర్‌ఫ్రంట్‌ అభివృద్ధి పనుల్ని ప్రారంభించారు. తొలుత రూ.900 కోట్లతో 11.5 కిలోమీటర్ల అభివృద్ధి ప్రణాళికతో పనులు మొదలయ్యాయి.
 • అప్పటి గుజరాత్‌ ముఖ్యమంత్రి నరేంద్ర మోదీ 2012 ఆగస్టు 15న ప్రారంభించగా…ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. అంటే ప్రతిపాదనలు తయారైన తర్వాత ఏకంగా 44 సంవత్సరాలకు పనులు మొదలైతే 51 సంవత్సరాల తర్వాత ప్రజలకు అందుబాటులోకి వచ్చింది.
 • సబర్మతి రివర్‌ఫ్రంట్‌ అభివృద్ధికి 2014లో వ్యయం రూ.1,152 కోట్లు కాగా…2019 నవంబరు నాటికి రూ.1400 కోట్లకు చేరింది.

ఏడాదంతా గోదారమ్మను పారించేందుకు..

ఏడాదంతా మూసీలో గోదావరిజలాలు ప్రవహించి, చెత్తాచెదారం పేరుకోకుండా,దుర్గంధం వ్యాపించకుండా ఉండేందుకు సీఎం కేసీఆర్‌ ఎంతో ముందుచూపుతో కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగానే డిజైన్‌ రూపొందించారు. కొండ పోచమ్మసాగర్‌ నుంచి 700 క్యూసెక్కుల జలాల్ని జంట జలాశయాలకు తరలించి, అక్కడినుంచి మూసీలో అవసరమైనపుడు ప్రవాహం ఉండేలా ప్రత్యేకంగా డిజైన్‌ చేయించారు. ఈ విషయాన్ని శాసనమండలిలో పురపాలకమంత్రి కేటీఆర్‌ వెల్లడించారు. మూసీ సుందరీకరణ ప్రారంభ దశలోనే ఉంది. సబర్మతి తరహాలో మారేందుకు కొంత సమయం పడుతుంది. కానీ ఈ వాస్తవాల్ని తెలిసినప్పటికీ ‘ ఈనాడు ’ మాత్రం సీఎం ప్రకటన చేసి ఐదేండ్లయిందంటూ ప్రజల్ని తప్పుదోవ పట్టించే కుయక్తులు పన్నుతున్నది.

ఇవి కనిపించలేదా ?

 • మూసీ పరిరక్షణకు మూసీ రివర్‌ఫ్రంట్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
 • మూసీని అందంగా తీర్చిదిద్దేందుకు అంతర్జాతీయస్థాయిలో డిజైన్ల కోసం పోటీలు నిర్వహించింది. 10 జాతీయ, అంతర్జాతీయ సంస్థలు తమ పేర్లను నమోదు చేసుకొని, 50కి పైగా డిజైన్లు రూపొందించాయి. అందులో ఉత్తమమైన 9 డిజైన్లను కార్పొరేషన్‌ ఎంపిక చేసింది.
 • గ్రేటర్‌ చుట్టూ ఉన్న ఔటర్‌ రింగు రోడ్డును మూసీ నది ఒక చివరి నుంచి మొదలై మరో చివరలో కలుస్తుంది. నది పారే ప్రాంతం మీదుగా ఈస్ట్‌-వెస్ట్‌ కారిడార్‌ స్కైవేను నిర్మించాలని ప్రతిపాదనలు సిద్ధం చేసింది.
 • నది పొడవునా డ్రోన్‌తో సర్వే చేయించగా, ఇరువైపులా 50 మీటర్ల మేర బఫర్‌ జోన్‌గా గుర్తించారు.
 • తాత్కాలిక ఏర్పాట్లు కాకుండా శాశ్వత ప్రాతిపదికన మూసీ తీర ప్రాంతం అభివృద్ధిపైనే ప్రధానంగా దృష్టి సారించింది.
 • ఉప్పల్‌ భగాయత్‌ లేఅవుట్‌ను అభివృద్ధి చేసిన హెచ్‌ఎండీఏ..మూసీ వెంబడి ఉన్న బఫర్‌ జోన్‌ సుందరీకరణ పనులు చేపట్టింది. రామంతాపూర్‌ కేటీఆర్‌ నగర్‌ నుంచి నాగోలు ఇన్నర్‌ రింగురోడ్డు వంతెన వరకు, అక్కడి నుంచి పీర్జాదిగూడ వరకు లే అవుట్‌లో భాగంగా మూసీ వెంబడి బఫర్‌ జోన్‌ 50 మీటర్ల తర్వాత సుమారు 120 అడుగుల వెడల్పుతో 4 వరుసలతో రహదారిని నిర్మించారు.
 • ఉప్పల్‌ భగాయత్‌ లేఅవుట్‌లో మినీ శిల్పారామం కోసం సుమారు 9 ఎకరాలను హెచ్‌ఎండీఏ కేటాయించింది. రూ.5 కోట్లు వెచ్చించి రకరకాల స్టాల్స్‌, గ్రామీణ వాతావరణం ఉట్టిపడేలా పలు నిర్మాణాలు చేపట్టారు.
 • నాగోలు నుంచి మూసీ నది పొడవునా పీర్జాదిగూడ, పర్వత్‌నగర్‌, ప్రతాప సింగారం మీదుగా గౌరెల్లి, కొర్రెముల వరకు 4 వరుసలతో రేడియల్‌ రోడ్డు నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేసింది.
 • మూసీ వెంట దోమల నియంత్రణకు 642 ప్రత్యేక బృందాలు పనిచేస్తున్నాయి. డ్రోన్‌ కెమెరాలతో యాంటీ లార్వా మందును పిచికారి చేస్తున్నారు.
 • ఇంకో ప్రధాన విషయమేమంటే.. మూసీలోకి చుక్క మురుగునీరు రాకుండా రూ.3836.21 కోట్ల వ్యయంతో 31 చోట్ల మురుగునీటి శుద్ధి కేంద్రాలను నిర్మించనుంది. రెండేండ్లలో పూర్తయ్యే వీటి నిర్మాణానికి టెండర్లు కూడా పిలిచారు. ఇవి అందుబాటులోకి వస్తే మురుగు అస్సలు చేరదు. గోదావరిజలాల తరలింపుతో కొద్దోగొప్పో చెత్త ఉన్నా కొట్టుకుపోతుంది.

సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి

లోక‌ల్ టు గ్లోబ‌ల్ వార్త‌ల కోసం.. న‌మ‌స్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

ఇవి కూడా చూడండి..

అద‌ర‌హో మూసీ

నాడు కంపు.. నేడు ఇంపు : మూసీ అందం చూశారా

నాగోల్ బ్రిడ్జికి ప‌చ్చ‌ల‌హారం

Musi River | మూసీపై ఈనాడు ( eenadu ) నానాయాగి.. సుందరీకరణపై విషపు రాతలు

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement