తెలంగాణ ఆర్టీసీలో ట్రేడ్ యూనియన్లపై ఉన్న ఆంక్షలను తక్షణమే ఎత్తివేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ డిమాండ్ చేసింది. ఈ మేరకు మెయిల్ ద్వారా లేఖ పంపింది.
ఎవరో ప్రేరేపిస్తేనో, ఏవో రాజకీయ పార్టీలు ఉసిగొల్పితేనే తాము ఉద్యమాలు చేస్తున్నామంటూ సీఎం రేవంత్‌రెడ్డి ఆక్షేపించడం బాధాకరమని ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ పేర్కొన్నది.
RTC Strike | తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగింది. తమ డిమాండ్లపై రేవంత్ రెడ్డి సర్కార్ స్పందించకపోవడంతో.. మే 7వ తేదీ నుంచి నిరవధిక సమ్మె చేయాలని ఆర్టీసీ కార్మిక సంఘాలు నిర్ణయించాయి.
‘తెలంగాణ ఆర్టీసీ కార్మిక సంఘాలది ఇక నుంచి ఒకే మాట, ఒకే బాట.. అదే సమ్మెబాట’ అని అన్ని సంఘాలు తీర్మానించాయి. మే 7 నుంచి జరిగే ఆర్టీసీ సమ్మెకు అన్ని కార్మిక సంఘాలు కలిసి రావాలని జేఏసీ కోరింది.
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మహాలక్ష్మి పథకం కింద అమలు చేస్తున్న ఉచిత బస్సు ప్రయాణానికీ బడ్జెట్లో కొర్రీలు పెట్టారు. మహాలక్ష్మి పథకంలో ఇస్తున్న జీరో టికెట్ల విలువ నెలకు రూ.400 కోట్లు కాగా.. ఏడాద
ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయడంతో పాటు, కార్మికుల పెండింగ్ సమస్యలన్నింటినీ పరిష్కరించాలని ఆర్టీసీ మెజారిటీ యూనియన్ల జేఏసీ చైర్మన్ అశ్వత్థామరెడ్డి డిమాండ్ చేశారు.
టీఎస్ ఆర్టీసీలోని అన్ని కార్మిక సంఘాల ట్రేడ్ యూనియన్లను పునరుద్ధరించాలని, ఈ మేరకు లేబర్ కమిషనర్‌కు ఈ నెల 24లోపు లేఖలు అందజేయాలని వివిధ కార్మిక సంఘాల నేతలు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.