RTC Strike | మే 6 అర్ధరాత్రి నుంచి ఆర్టీసీ బస్సులు బంద్.. ఎందుకంటే..?
RTC Strike | తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగింది. తమ డిమాండ్లపై రేవంత్ రెడ్డి సర్కార్ స్పందించకపోవడంతో.. మే 7వ తేదీ నుంచి నిరవధిక సమ్మె చేయాలని ఆర్టీసీ కార్మిక సంఘాలు నిర్ణయించాయి.
RTC Strike | హైదరాబాద్ : తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగింది. తమ డిమాండ్లపై రేవంత్ రెడ్డి సర్కార్ స్పందించకపోవడంతో.. మే 7వ తేదీ నుంచి నిరవధిక సమ్మె చేయాలని ఆర్టీసీ కార్మిక సంఘాలు నిర్ణయించాయి. దీంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మే 6వ తేదీ అర్ధరాత్రి నుంచి ఆర్టీసీ బస్సులు బంద్ కానున్నాయి. బస్సులన్నీ డిపోలకే పరిమితం కానున్నాయి. ఆర్టీసీ పరిరక్షణ, విలీన ప్రక్రియ పూర్తి చేయాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం జనవరి 27న ఇచ్చిన సమ్మె నోటీసుపై సంస్థ యాజమాన్యం, ప్రభుత్వం, లేబర్ కమిషనర్ నుంచి ఎటువంటి స్పందన రాకపోవడంతో సమ్మెకు సిద్ధమయ్యారు.
హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆర్టీసీ జేఏసీ ఇటీవలే అన్ని కార్మిక సంఘాలతో సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే. ‘తెలంగాణ ఆర్టీసీ కార్మిక సంఘాలది ఇక నుంచి ఒకే మాట, ఒకే బాట.. అదే సమ్మెబాట’ అని అన్ని సంఘాలు నాడు తీర్మానించాయి. మే 7 నుంచి జరిగే ఆర్టీసీ సమ్మెకు అన్ని కార్మిక సంఘాలు కలిసి రావాలని జేఏసీ కోరింది. యూనియన్ల మధ్య ఉన్న భిన్నాభిప్రాయాలను, భేషజాలను విడనాడి జేఏసీతో కలిసి రావాలని, కార్మిక ప్రయోజనాల పరిరక్షణతోపాటు ప్రభుత్వ కుట్రలను తిప్పికొట్టేందుకు ఐక్యంగా పోరాడాలని కోరారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rice Price | కిలో బియ్యం రూ.100 దాటనుందా? నెల రోజుల్లోనే 35 శాతం పెరిగిన సన్నబియ్యం ధరలు!
Rahul Sankrityan | ‘రణబాలి’పై నెగెటివ్ ప్రచారం చేశారు.. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ సంచలన వ్యాఖ్యలు!
Paris Shooting: పారిస్లో రేసిస్ట్ అటాక్.. ఒకరు మృతి, అయిదుగురికి గాయాలు
Rajanna Sircilla | ఆపదలో ఉన్నా ఆదుకోరూ..! మంచానికే పరిమితమైన ఫీల్డ్ అసిస్టెంట్.. వైద్యం కోసం ఎదురుచూపు
Foreign currency | శంషాబాద్ ఎయిర్పోర్టులో భారీగా ఫారిన్ కరెన్సీ పట్టివేత
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

