హైదరాబాద్, ఏప్రిల్ 22 (నమస్తే తెలంగాణ): ‘తెలంగాణ ఆర్టీసీ కార్మిక సంఘాలది ఇక నుంచి ఒకే మాట, ఒకే బాట.. అదే సమ్మెబాట’ అని అన్ని సంఘాలు తీర్మానించాయి. మే 7 నుంచి జరిగే ఆర్టీసీ సమ్మెకు అన్ని కార్మిక సంఘాలు కలిసి రావాలని జేఏసీ కోరింది. హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జేఏసీ మంగళవారం అన్ని కార్మిక సంఘాలతో సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా ఎస్‌డబ్ల్యూఎఫ్ (సీఐటీయూ) ప్రధాన కార్యదర్శి వీఎస్ రావు మాట్లాడుతూ.. ఆర్టీసీలో సమ్మె అనివార్యమైతే దానికి వ్యతిరేకంగా ఎస్‌డబ్ల్యూఎఫ్ వ్యవహరించబోదని, కార్మిక ప్రయోజనాల కోసం సమ్మెకు అండగా ఉంటామని స్పష్టంచేశారు. అన్ని సంఘాలను ఏకతాటిపైకి తెచ్చేలా జేఏసీ చర్యలు చేపట్టాలని సూచించారు.
ఎస్‌డబ్ల్యూయూ (ఐఎన్టీయూసీ) ప్రధాన కార్యదర్శి కే రాజిరెడ్డి మాట్లాడుతూ.. ఆర్టీసీ సమ్మెలో పాల్గొనేందుకు అన్ని సంఘాలు ముందుకొస్తే కార్మికుల సమస్యల పరిషారం కోసం సమ్మెలో పాల్గొనేందుకు తామూ వెనుకాడబోమని చెప్పారు. సమ్మెకు వ్యతిరేకంగా ఎకడా మాట్లాడలేదని స్పష్టం చేశారు. అనంతరం జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న, కో-చైర్మన్ కే హన్మంతు ముదిరాజ్, వైస్ చైర్మన్ ఎం థామస్‌రెడ్డి, కన్వీనర్ ఎండీ మౌలానా, కో-కన్వీనర్లు కత్తుల యాదయ్య, సుద్దాల సురేశ్, బీ యాదగిరి మాట్లాడుతూ..
యూనియన్ల మధ్య ఉన్న భిన్నాభిప్రాయాలను, భేషజాలను విడనాడి జేఏసీతో కలిసి రావాలని, కార్మిక ప్రయోజనాల పరిరక్షణతోపాటు ప్రభుత్వ కుట్రలను తిప్పికొట్టేందుకు ఐక్యంగా పోరాడాలని కోరారు. గతంలో నాయకుల మధ్య అభిప్రాయ భేదాలున్నప్పటికీ సమ్మె సమయంలో అందరూ ఒకే జట్టుగా కలిశారని గుర్తుచేశారు. సమావేశంలో జేఏసీ కోశాధికారి యాద య్య, మీడియా ఇన్చారి అప్పారావు, ప్రతినిధులు ఎన్ కమలాకర్‌గౌడ్, ఎం వెంకటిగౌడ్, ఎస్‌డబ్ల్యూఎఫ్ నాయకులు రవీందర్‌రెడ్డి, ఎస్‌డబ్ల్యూయూ నాయకులు సాయిరెడ్డి, కేఎస్ పాల్, సీఎన్ కృష్ణ, రాంచందర్, ఏ గౌరీశంకర్, జీ రాములు, ఎస్ వెంకటేశ్, రవీందర్, ముత్యాలు పాల్గొన్నారు.