ప్రకృతిలోని అందాలన్నీ ఆవిష్కరించే వసంత రుతువు ప్రవేశించిన తర్వాత నిర్వహించే తొలి పండుగ హోలీ. ఇంద్ర ధనస్సులోని రంగులన్నీ ఒకే చోట కుప్ప పోసినట్లు అందంగా.. ఆహ్లాదంగా.. ఈ రంగోళిని శుక్రవారం ఆనందంగా జరుపుకోన�
వసంత రుతువు ఆగమనం మనసుల్లో ఉత్సాహమే కాదు.. ప్రకృతిలో సరికొత్త సొగసులు కూడా తెస్తుంది. ఎండిన చెట్లు చిగురించి పువ్వులతో పాటు కొమ్మలు కనువిందు చేస్తాయి. మల్లెలు విరబూస్తు సువాసనలు వెదజల్లుతాయి.
కులమతాలకతీతంగా చిన్నాపెద్ద తేడా లేకుండా అందరూ ఆనందంగా జరుపుకొనే పండుగ హోలీ. పండుగ వేడుకలను ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఘనంగా నిర్వహించనున్నారు. హోలీ పండుగకు ఒక రోజు ముందుగా కాముడి దహనం చేస్తారు.
హోలీ అంటేనే రంగుల పండుగ. ఆ రంగులు సహజసిద్ధమైనవి అయితే ఆ వేడుకే వేరు. రెండు దశాబ్దాల కిందట సహజసిద్ధమైన సంప్రదాయ రంగులతో హోలీ చేసుకునేవారు. పూలతో తయారుచేసిన రంగులను చల్లుకునేవారు.
ప్రజలంతా ఉత్సాహంగా జరుపుకొనే పండుగ హోలీ. వసంత రుతువులో వచ్చే తొలి వేడుక ఇది. వసంతగమనాన్నీ, కొత్త సంవత్సరాన్ని ఆహ్వానిస్తూ పాల్గుణ పౌర్ణమి రోజు వచ్చే జరుపుకొనే ఈ పర్వదినాన్ని వసంతోత్సవం అనీ, పాల్గుణోత్సవ
‘హోలీ..హోలీల రంగ హోలీ ..చెమ్మకేళిల హోలీ’ అంటూ ఏడాదికోసారి నిర్వహించుకునే రంగుల వేడుకకు ఉమ్మడి జిల్లా ప్రజానీకం సిద్ధమైంది. చిన్నా,పెద్ద ఆనందడోలికల్లో మునిగి తేలనుండగా, మోములన్నీ వర్ణ శోభితం కానున్నాయి.