నేడు హోలీ
వసంత రుతువు ఆగమనం మనసుల్లో ఉత్సాహమే కాదు.. ప్రకృతిలో సరికొత్త సొగసులు కూడా తెస్తుంది. ఎండిన చెట్లు చిగురించి పువ్వులతో పాటు కొమ్మలు కనువిందు చేస్తాయి. మల్లెలు విరబూస్తు సువాసనలు వెదజల్లుతాయి.
- సహజ రంగులే శ్రేయస్కరం
- ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలిపిన మండలి చైర్మన్ గుత్తా, మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి
రామగిరి , మార్చి 24 : వసంత రుతువు ఆగమనం మనసుల్లో ఉత్సాహమే కాదు.. ప్రకృతిలో సరికొత్త సొగసులు కూడా తెస్తుంది. ఎండిన చెట్లు చిగురించి పువ్వులతో పాటు కొమ్మలు కనువిందు చేస్తాయి. మల్లెలు విరబూస్తు సువాసనలు వెదజల్లుతాయి. ప్రకృతిలోని అందాలన్నీ ఆవిష్కరించే వసంత రుతువు ప్రవేశించిన తర్వాత జరుపుకొనే తొలి వేడుక హోలీ. ఇంద్రధనస్సులోని రంగులు ఒకచోట కుప్ప పోసినట్లు అందంగా, ఆహ్లాదంగా రంగోళిని చిన్న, పెద్ద తేడా లేకుండా జరుపుకొనే వేడుక ఇది. సోమవారం హోలీ సందర్భంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వేడుకకు చిన్నా, పెద్ద సిద్ధం చేసుకున్నాడు.
ఆదివారం రాత్రి కాముని దహనం చేశారు. ఆటపాటలతో యువత ఉత్సాహంగా గడిపారు. హోలీలో రసాయనాలకు బదులు సహజ సిద్ధంగా లభించే రంగులను వాడడం శరీరానికి మంచిదని వైద్య నిపుణులు చెబుతున్నారు. వసంత కాలంలో మోదుగు చెట్లు విపరీతంగా పూస్తాయి. జిల్లా ప్రజలకు శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మాజీ మంత్రి, సూర్యాపేట శాసన సభ్యుడు గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి హోలీ శుభాకాంక్షలు తెలిపారు. పచ్చని చిగురులతో కొత్తదనం సంతరించుకొని, వినూత్నంగా పున:ప్రారంభమయ్యే ప్రకృతి కాలచక్రానికి హోలీ పండుగ స్వాగతం పలుకుతుందని వారు చెప్పారు. ప్రేమ, ఆప్యాయత, సౌభ్రాతృత్వానికి ప్రతీక అయిన రంగుల పండుగ అందరి జీవితాల్లో ఆనందాన్ని తీసుకురావాలని ఆకాంక్షించారు.
సహజ రంగుల తయారీ ఇలా
- రెండు చెంచాల పసుపు పొడిలో నాలుగు చెంచాల గంధం పసుపు పొడి కలిపితే ఉన్నతమైన పసుపు రంగు వస్తుంది.
- మోదుగు పూలను ఉడక బెట్టి సహజ సిద్థమైన రంగులు తయారు చేసుకోవచ్చు.
- బీట్ రూట్‌ను నీటిలో మెత్తగా ఉడికించి నీటిలోనే పిండిగా మారిస్తే ఎరుపు రంగు వస్తుంది.
- ఎర్ర చందనాన్ని నీటిలో కలిపితే ఎరుపు రంగును పొందవచ్చు.
- గోరింటాకును రుబ్బి పిండిలో కలిపితే ఆకుపచ్చ రంగును తయారు చేసుకోవచ్చు.
- నల్ల ద్రాక్ష పళ్లను నీటిలో నాన బెట్టి మెత్తగా ఉడకబెట్టి తొక్కలు, గింజలను వేరు చేస్తే అందమైన వంకాయ వర్ణం వస్తుంది.
- బంతి పువ్వులు, మందార పుష్పాలను నీటిలో నానబెట్టి పిసికితే ఆయా పుష్పాల రంగును బట్టి రంగులను పొందవచ్చు.
- నీలి మందును నీటిలో కలిపితే నీలి రంగు వస్తుంది.
- తులసి, వేప, కలబంద ఆకులు కలిపి నూరి నీటిలో కలిపితే ముదురు ఆకుపచ్చ వర్ణం, మంచి సువాసన వస్తుంది.
- మెంతు ఆకులు మైదా పిండి కలిపితే కూడా రంగులు తయారు చేసుకోచ్చు హోలీలో పాటించాల్సిన జాగ్రత్తలు
- కోడిగుడ్లు, రసాయన రంగులు వాడకూడదు
- శరీరాన్ని పూర్తిగా కప్పివేసి ఉంచే దుస్తులను ధరించాలి
- శరీరానికి కొబ్బరినూనె రాసుకుని హోలీ జరుపుకోవడం ఉత్తమం
- రసాయన రంగులను చల్లుకోవడంతో చర్మ వ్యాధులు వచ్చే అవకాశముంది
- వేడుకల్లో కండ్లకు అద్దాలతోపాటు చెప్పులు వేసుకోవాలి.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
వరల్డ్ బ్యాంక్ బృందం నల్లగొండ క్లాక్ టవర్ జంక్షన్ అభివృద్ధి పనుల పరిశీలన
Mamitha Baiju | అతడి నిర్ణయమే ఫైనల్.. పెళ్లి పుకార్లకు ఫుల్స్టాప్ పెట్టిన మమితా బైజు
Women | మహిళలు తప్పనిసరిగా చేయించుకోవాల్సిన వైద్య పరీక్షలు ఇవే.. నిపుణుల సూచన..
Rashmi | ఐదేళ్ల చిన్నారి హత్యపై యాంకర్ రష్మి ఆవేదన.. మనం ఎటు వెళ్తున్నాం అంటూ భావోద్వేగ పోస్ట్!
Marnus Labuschagne | 49 ఏళ్లలో ఒకేఒక్కడు.. భారత దిగ్గజం సరసన లబూషేన్..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

