రంగేలి
ప్రజలంతా ఉత్సాహంగా జరుపుకొనే పండుగ హోలీ. వసంత రుతువులో వచ్చే తొలి వేడుక ఇది. వసంతగమనాన్నీ, కొత్త సంవత్సరాన్ని ఆహ్వానిస్తూ పాల్గుణ పౌర్ణమి రోజు వచ్చే జరుపుకొనే ఈ పర్వదినాన్ని వసంతోత్సవం అనీ, పాల్గుణోత్సవం అని కూడా అంటారు.
- నేడు హోలీ
- వసంతంలో తొలి పండుగ
- రెండ్రోజులపాటు వేడుకలు
- సహజ రంగులే మేలు
- రసాయనాలతో హాని
ప్రజలంతా ఉత్సాహంగా జరుపుకొనే పండుగ హోలీ. వసంత రుతువులో వచ్చే తొలి వేడుక ఇది. వసంతగమనాన్నీ, కొత్త సంవత్సరాన్ని ఆహ్వానిస్తూ పాల్గుణ పౌర్ణమి రోజు వచ్చే జరుపుకొనే ఈ పర్వదినాన్ని వసంతోత్సవం అనీ, పాల్గుణోత్సవం అని కూడా అంటారు. ఈ పండుగ రోజు చిన్నా పెద్దా తేడా లేకుండా అంతా రంగులు చల్లుకుంటారు. ఎంతో సంబురంగా జరుపుకొంటారు. ఎప్పట్లాగే ఈ సారి హోలీని ఘనంగా జరుపుకొనేందుకు సిద్ధమయ్యారు.
కామదహనం..
హోలీ అనగానే గుర్తొచ్చేది కాముని పున్నం. ఊళ్లలో పిల్లలు పది రోజుల ముందు నుంచే ఇంటింటా తిరుగుతూ జాజిరి ఆటలు ఆడుతారు. సేకరించిన డబ్బులు పంచుకుని, ధాన్యంతో వంటలు చేసుకుంటారు. హోలీ ముందు రోజు రాత్రి పది గంటల నుంచి కామదహనం నిర్వహిస్తారు. ఇన్ని రోజులు ఆడిన కోలలను అందులో వేస్తారు. శరీరంలోని చీడ, పీడలు వదిలి అందరికీ సర్వ సుఖాలు కలగాలని ఆశిస్తూ ఇంట్లోని పాత చెక్క వస్తువులను, కలపను చౌరస్తాలు, ప్రధాన ప్రాంతాల్లో చేర్చి దహనం చేస్తారు. మిగిలిన బూడిదను దిష్టి తగలకుండా బొట్టు పెట్టుకుంటారు. శారీరక, మానసిక ప్రశాంతత చేకూరాలని వేడుకుంటారు.
సహజ రంగులే మేలు..
మోదుగుపూలు జనవరి, ఫిబ్రవరి నెలల్లో విరగబూస్తాయి. ప్రాచీనకాలంలో రంగుల కోసం మోదుగ పూలు వాడేవారు. ఇవి చర్మానికి ఎంతో శోభ తెచ్చేవి. మోదుగపూలను ఎండబెట్టి దాని నుంచి రంగులు తయారుచేయవచ్చు. ఇది ఆరోగ్యానికి దోహదకారి మాత్రమే గాక, ఈ కాలంలో వచ్చే రోగాలకు దివ్యమైన ఔషధంలా పని చేస్తుంది. ఇంకా హెన్నా(మైదాకు పొడి), పసుపు, కుంకుమ, చందనం, టమాట గింజలతో తయారైన పొడిని నీళ్లలో కలిపి చల్లుకునే వారు.
ఇలాంటి రంగులు పూసుకోవడం ద్వారా సంతోషం, ఆనందం కలుగుతాయి. అలాగాక రసాయనాలు కలిపిన రంగులు పూసుకోవడం వల్ల లేనిపోని చర్మరోగాలు అంటుకుంటాయి. కానీ, ఇప్పుడు ఎక్కడ చూసినా రసాయనిక రంగులే కనిపిస్తున్నాయి. వీటితో లేని పోని ఆరోగ్య సమస్యలు వస్తాయి. అందుకే స్వచ్ఛమైన కుంకుమ, బుకా గుల్లాలు వంటి రంగులతో పండుగ జరుపుకొంటే మేలని నిపుణులు సూచిస్తున్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
వరల్డ్ బ్యాంక్ బృందం నల్లగొండ క్లాక్ టవర్ జంక్షన్ అభివృద్ధి పనుల పరిశీలన
Mamitha Baiju | అతడి నిర్ణయమే ఫైనల్.. పెళ్లి పుకార్లకు ఫుల్స్టాప్ పెట్టిన మమితా బైజు
Women | మహిళలు తప్పనిసరిగా చేయించుకోవాల్సిన వైద్య పరీక్షలు ఇవే.. నిపుణుల సూచన..
Rashmi | ఐదేళ్ల చిన్నారి హత్యపై యాంకర్ రష్మి ఆవేదన.. మనం ఎటు వెళ్తున్నాం అంటూ భావోద్వేగ పోస్ట్!
Marnus Labuschagne | 49 ఏళ్లలో ఒకేఒక్కడు.. భారత దిగ్గజం సరసన లబూషేన్..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

