పెద్దఅంబర్‌పేట, మార్చి 24: హోలీ అంటేనే రంగుల పండుగ. ఆ రంగులు సహజసిద్ధమైనవి అయితే ఆ వేడుకే వేరు. రెండు దశాబ్దాల కిందట సహజసిద్ధమైన సంప్రదాయ రంగులతో హోలీ చేసుకునేవారు. పూలతో తయారుచేసిన రంగులను చల్లుకునేవారు.
కానీ, ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. అప్పటికప్పుడు దొరికే కెమికల్ రంగులకే డిమాండ్ ఉన్నది. పెద్దఅంబర్‌పేట మున్సిపాలిటీలో విరగబూసిన మోదుగు పూలు ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేస్తున్నాయి.