ప్రకృతిలోని అందాలన్నీ ఆవిష్కరించే వసంత రుతువు ప్రవేశించిన తర్వాత నిర్వహించే తొలి పండుగ హోలీ. ఇంద్ర ధనస్సులోని రంగులన్నీ ఒకే చోట కుప్ప పోసినట్లు అందంగా.. ఆహ్లాదంగా.. ఈ రంగోళిని శుక్రవారం ఆనందంగా జరుపుకోనున్నారు. చిన్నా, పెద్ద తేడా లేకుండా కాలనీలు, రోడ్లపై కేరింతలు కొడుతూ.. ఆటపాటలతో రంగులతో హోరెత్తించనున్నారు.