హోలీ..ఆనంద కేళీ..
కులమతాలకతీతంగా చిన్నాపెద్ద తేడా లేకుండా అందరూ ఆనందంగా జరుపుకొనే పండుగ హోలీ. పండుగ వేడుకలను ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఘనంగా నిర్వహించనున్నారు. హోలీ పండుగకు ఒక రోజు ముందుగా కాముడి దహనం చేస్తారు.
- సహజసిద్ధ రంగులు క్షేమకరం.. రసాయన రంగులు ప్రమాదకరం
- రంగుల వాడకంలో జాగ్రత్తలు తప్పనిసరి అంటున్న నిపుణులు
కులమతాలకతీతంగా చిన్నాపెద్ద తేడా లేకుండా అందరూ ఆనందంగా జరుపుకొనే పండుగ హోలీ. పండుగ వేడుకలను ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఘనంగా నిర్వహించనున్నారు. హోలీ పండుగకు ఒక రోజు ముందుగా కాముడి దహనం చేస్తారు. వ్యాపారస్తులు వివిధ రకాల రంగులను మార్కెట్లో విక్రయించేందుకు సిద్ధంగా ఉంచడంతో పండుగ వాతావరణం నెలకొన్నది.
గులాల్, ఆకుపచ్చ, పసుపుపచ్చ, ఎరుపు, బంగారపు రంగుల పొట్లాలను ఒక్కొక్కటి రూ.5 నుంచి రూ.150 వరకు, చిన్నారులు వినియోగించే రంగుల తుపాకులను రూ.20 నుంచి రూ.1200 వరకు విక్రయిస్తున్నారు. కోడిగుడ్లను అదనంగా అమ్ముతున్నారు. హోలీ రోజున నీటిలో రంగులు కలిపి ఒకరిపై ఒకరు చల్లుకుని సరదాగా గడుపుతారు. హోలీకి ముందురోజు గ్రామంలోని నడిబొడ్డున కట్టెలు, పిడకలు ఒకదగ్గర చేర్చి కాముని కాల్చుతూ… యువకులు సంతోషంగా గడుపుతారు. ఈ పండుగపూట రసాయన రంగులు వాడి చర్మానికి రోగాలు కొనితెచ్చుకోకుండా సహజసిద్ధంగా లభించే రంగులను వాడాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
– న్యూస్ నెట్వర్క్
సహజ రంగులతో..

పసుపుతో చేసిన రంగులు వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తాయి. తులసి ఆకులతో చేసిన రంగులు మానసికోల్లాసానికి తోడ్పడతాయి. శ్వాసక్రియ శక్తిని పెంచుతాయి. కలబంద, వేపాకులు చర్మ వ్యాధులను తగ్గిస్తాయి. దురదల నివారణకు ఉపయోగపడతాయి. గోరింటాకు శరీర పగుళ్లను నివారిస్తుంది. గంధంపొడి మనసుకు ప్రశాంతత కలిగించడంతో పాటు సువాసన వెదజల్లుతుంది.
రసాయన రంగులతో..
రసాయన రంగులతో హోలీ పండుగ ఎంత ఉల్లాసాన్ని నింపుతుందో.. అంతే విషాదాన్ని మిగుల్చుతుంది. రంగుల్లో వాడే రసాయన పదార్థాలతో శరీరానికి హాని కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కళ్ల మంటలు, ఆస్తమా, చర్మ వ్యాధులు సంభవిస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. నలుపు రంగులో లెడ్ ఆక్సైడ్ ఉంటుందని, ఇది మూత్రపిండాలను పాడు చేస్తుందని, వెండి రంగులో ఉండే మెర్క్యూరీ సల్ఫేట్‌తో క్యాన్సర్ సోకే అవకాశముందని హెచ్చరిస్తున్నారు.
ఆకుపచ్చ రంగుల్లో ఉండే కాపర్ సల్ఫేట్ ద్వారా ఎలర్జీతో పాటు శాశ్వత అంధత్వం వచ్చే అవకాశం ఉంది. ఎక్కువ శాతం డ్రై కలర్స్ అంతగా చర్మానికి, జుట్టుకు చేటు చేయవు. అయితే మెటల్స్ కూడా ఈ పొడుల్లో కలిసిపోయే తరహా రంగులను మాత్రం వాడవద్దు. ముఖ్యంగా సిలికా పార్టికల్స్ అధికంగా ఉన్న రంగుల వాడకం వల్ల చర్మం బాగా పాడయ్యే ఆవకాశాలున్నాయి. పొడిగా ఉండే రంగుల్లో జిలెటిన్ పైలట్ కలవడం వల్ల మైకంతో పాటు ఆస్తమా, అంధత్వం వచ్చే అవకాశం ఉందని శాస్త్రవేత్తల పరిశోధనల్లో తేలింది.

చర్మ సంరక్షణకు..
- కొన్ని రంగుల వల్ల ఎలర్జీకి గురయ్యే ఆవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందుకే రంగులు చల్లుకునే ముందు కొబ్బరి నూనె లేదా మాయిశ్చరైజర్‌ను చర్మానికి రాసుకోవాల్సి ఉంటుంది.
- బయటకి కనిపించే భాగాలకు ఆయా రంగులు చర్మంపై పడిన తరువాత దురదగా అనిపిస్తే వెంటనే నీటితో శుభ్రంగా కడిగి మళ్లీ మాయిశ్చరైజర్ పట్టించాలి.
- ఈ రంగుల వల్ల చర్మం పొడిబారిపోయే ఆవకాశాలు కూడా ఉన్నాయి. సెన్సిటివ్ స్కిన్ కోసం క్లీనజర్ వాడడం మరిచిపోవద్దు.
- రంగులను ఎట్టి పరిస్థితుల్లోనూ కళ్లు, ముక్కు, చెవులు, నోటిలోకి ఏ రూపంలోనూ వెళ్లనీయవద్దు.
జుట్టు సంరక్షణకు.. - హోలీలో వాడే రంగుల వల్ల జుట్టు పొడిబారడం, చిట్లిపోవడం జరుగుతుంది. ఈ బాధల నుంచి విముక్తి కోసం, రంగుల వల్ల జరిగే నష్ట నివారణ కోసం జుట్టుకు నూనె పెట్టుకోవాల్సిందే.
- రంగులు చల్లుకోవడం పూర్తయిన తరువాత మృదువైన షాంపుతో శుభ్రంగా తలంటుకోవడమే కాదు, కండిషనర్ను కూడా వాడాల్సి ఉంటుంది. తద్వారా జుట్టు మళ్లీ ఆరోగ్యకరమైన స్థితికి చేరుకుంటుంది.
- హోలీ ఆడుతున్నప్పుడు జుట్టును పూర్తిగా కప్పేయండి. దీని వల్ల జుట్టు పైనింగ్తో పాటు ప్రోటీన్ కూడా కోల్పోకుండా ఉంటుంది.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు

- రసాయన మందులతో కళ్లకు హాని కలగకుండా సన్ గ్లాసెస్ వాడాలి. దంతాలపై రంగులు పడకుండా డెంటల్ క్యాప్స్ వేసుకోవాలి.
- వేడుకల్లో మందపాటి పాత దుస్తులు ధరించాలి.
- ముదురు రంగు దుస్తులు మంచిది. పుల్ హ్యాండ్స్ షర్ట్, చేతులకు గ్లౌజ్‌లు, కాళ్లకు సాక్సులు వేసుకోవాలి.
- కళ్లల్లో రంగు పడితే వెంటనే చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. మంట అనిపిస్తే వైద్యుడిని సంప్రదించాలి.
- తలపై రంగులు పడకుండా క్యాప్ పెట్టుకోవాలి. రంగులు చల్లుకోవడం పూర్తయ్యాక గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి.
- రంగులు చల్లుకున్నప్పుడు శరరీం దురదగా అనిపిస్తే వైద్యులను సంప్రదించాలి
- రంగులను చల్లుకునేటప్పుడు వదులైన దుస్తులను వేసుకోవాలి
- నెత్తిపై, శరీరంపై కోడిగుడ్లను కొట్టుకోరాదు.
సహజ రంగుల తయారీ విధానం

- పసుపు, కుంకుమ, పూలు, పండ్లు వివిధ రకాల పిండిని నీటిలో కలిపి ఉపయోగించుకోవచ్చు.
- మోదుగ పూలను ఉడకబెట్టి రంగు తయారు చేసుకోవచ్చు.
- గంధం, ఎర్ర మందారం, గోగుపూలు, దానిమ్మతొక్క, టమాట, క్యారెట్, పసుపు, సున్నం,మిశ్రమం కలిస్తే ఎరుపు రంగు వస్తుంది.
- శనగపిండి, పసుపు మిశ్రమం, బంతి, చామంతిపూల మిశ్రమంతో పసుపు రంగు వస్తుంది.
- గోరింటాకు, గుల్మొహర్ ఆకులు, గోధుమ మొలకలు, పాలకూర, కొత్తిమీర, పుదీనాతో ఆకుపచ్చ రంగు తయారుచేసుకోవచ్చు.
- ఇండిగో ప్లాంట్ (సిరా చెట్టు) కాయలతో నీలి రంగు తయారుచేసుకోవచ్చు.
- బీట్రూట్, ఉల్లిపాయ తొక్కల మిశ్రమంతో ముదురు కెంపు రంగు వస్తుంది. పారిజాత పూల కాడలను ఎండబెట్టి నానబెడితే సింధూరం రంగు వస్తుంది.
- బ్రౌన్ కలర్ కోసం కాఫీ లేదా టీ పొడి కలిపి వడపోసిన నీళ్లు లేదా మరగబెట్టిన నీళ్లు ఉపయోగించుకోవచ్చు.
- నల్ల ద్రాక్ష రసం లేదా ఎండబెట్టిన పెద్ద ఉసిరికాయలను ఉడికించి రాత్రంతా అలా వదిలేసి మరునాడు నీటిలో కలిపితే నలుపు రంగు తయారవుతుంది. ఎర్ర చందనాన్ని నీటిలో కలిపి ఎరుపు రంగు పొందవచ్చును. గోరింటాకును రుబ్బి పిండిలో కలిపితే ఆకుపచ్చ రంగును తయారు చేసుకోవచ్చు.
- రెండు చెంచాల గంధపు పొడిని లీటర్ నీటిలో కలిపి మరగబెడితే ఎరుపు రంగు ద్రావణం తయారు
చేసుకోవచ్చు.
- నీలి మందును నీటిలో కలిపితే నీలి రంగు వస్తుంది.
- తులసి, వేప, కలబంద కలిపి నూరితే ఆకుపచ్చ వర్ణం వస్తుంది.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Binod Chaudhary: నేపాలీ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన ఆ దేశ ఏకైక బిలియనీర్
వరల్డ్ బ్యాంక్ బృందం నల్లగొండ క్లాక్ టవర్ జంక్షన్ అభివృద్ధి పనుల పరిశీలన
Mamitha Baiju | అతడి నిర్ణయమే ఫైనల్.. పెళ్లి పుకార్లకు ఫుల్స్టాప్ పెట్టిన మమితా బైజు
Women | మహిళలు తప్పనిసరిగా చేయించుకోవాల్సిన వైద్య పరీక్షలు ఇవే.. నిపుణుల సూచన..
Rashmi | ఐదేళ్ల చిన్నారి హత్యపై యాంకర్ రష్మి ఆవేదన.. మనం ఎటు వెళ్తున్నాం అంటూ భావోద్వేగ పోస్ట్!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

