రంగుల కేళీ.. హోలీ..
‘హోలీ..హోలీల రంగ హోలీ ..చెమ్మకేళిల హోలీ’ అంటూ ఏడాదికోసారి నిర్వహించుకునే రంగుల వేడుకకు ఉమ్మడి జిల్లా ప్రజానీకం సిద్ధమైంది. చిన్నా,పెద్ద ఆనందడోలికల్లో మునిగి తేలనుండగా, మోములన్నీ వర్ణ శోభితం కానున్నాయి.
- నేడు జిల్లాలో వసంతోత్సవం..
- కులమతాలకతీతంగా వేడుక..
- సహజ రంగులే వాడాలని నిపుణుల పిలుపు
చెన్నూర్ టౌన్, మార్చి 24 : ‘హోలీ..హోలీల రంగ హోలీ ..చెమ్మకేళిల హోలీ’ అంటూ ఏడాదికోసారి నిర్వహించుకునే రంగుల వేడుకకు ఉమ్మడి జిల్లా ప్రజానీకం సిద్ధమైంది. చిన్నా,పెద్ద ఆనందడోలికల్లో మునిగి తేలనుండగా, మోములన్నీ వర్ణ శోభితం కానున్నాయి. స్నేహితులు, ఇంటిల్లిపాది, బంధువులతో ఊరువాడా సందడి నెలకొననుంది. ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి నాడు నిర్వహించే ఈ వసంతకేళిలో సహజ రంగులు వాడాలని వైద్య సిబ్బంది సూచిస్తున్నారు.
ఉత్సాహంగా వసంతోత్సవం
వసంత కాలంలో వచ్చే పండుగ కాబట్టి దీన్ని ‘వసంతోత్సవం’ అని కూడా పిలుస్తారు. హో లీ అంటే అగ్ని కానీ, అగ్నితో పునీతమైనది అ ని చెబుతుంటారు. ఇది చెడుపై మంచి సాధించిన విజయాన్ని కూడా సూచిస్తుంది. ఇది హి రణ్యకశ్యపుడిపై నారసింహుడి విజయంగా కూడా పేర్కొంటారు. జిల్లాలో ఆదివారం కా ముని పున్నం నిర్వహించారు. హోలికా దహనంతో వేడుకలు ప్రారంభమయ్యాయి. సోమవారం హోలీ పండుగకు సిద్ధమయ్యారు. ఆకర్షణీయమైన వర్ణద్రవ్యాలు, సింథటిక్ రంగులతో నిర్వహించుకుంటే చర్మ సంబంధ సమస్యలు వస్తాయని, సహజ రంగులను వినియోగించాలని వైద్యులు సూచిస్తున్నారు.
నీటి వనరుల వద్ద జాగ్రత్త…
హోలీ వేడుకలు ముగిశాక స్నానం చేసేందుకు పిల్లలు చెరువులు, కుంటలు, బావుల వద్దకు వెళ్లేందుకు ఉత్సాహం చూపుతుంటారు. తల్లిదండ్రులు ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. వీలైనంత వరకు చెరువులు, బావుల వద్దకు వెళ్లకుండా చూడాలి. ఇంట్లోనే స్నానం చేయడం మంచిది.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Binod Chaudhary: నేపాలీ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన ఆ దేశ ఏకైక బిలియనీర్
వరల్డ్ బ్యాంక్ బృందం నల్లగొండ క్లాక్ టవర్ జంక్షన్ అభివృద్ధి పనుల పరిశీలన
Mamitha Baiju | అతడి నిర్ణయమే ఫైనల్.. పెళ్లి పుకార్లకు ఫుల్స్టాప్ పెట్టిన మమితా బైజు
Women | మహిళలు తప్పనిసరిగా చేయించుకోవాల్సిన వైద్య పరీక్షలు ఇవే.. నిపుణుల సూచన..
Rashmi | ఐదేళ్ల చిన్నారి హత్యపై యాంకర్ రష్మి ఆవేదన.. మనం ఎటు వెళ్తున్నాం అంటూ భావోద్వేగ పోస్ట్!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

