గత వారం స్టాక్ మార్కెట్లు లాభాలతో అదరగొట్టాయి. మదుపరులు పెట్టుబడులకు పెద్దపీట వేశారు మరి. అయితే ఈ వారం లాభాల స్వీకరణకు వీలుందన్న అభిప్రాయాలు మార్కెట్ వర్గాల నుంచి వ్యక్తమవుతున్నాయి.
అమెరికా వడ్డీరేట్ల త్వరితంగా తగ్గవని సంకేతాలిస్తూ అక్కడి ఆర్థిక గణాంకాలు బలంగా వెలువడుతున్నప్పటికీ భారత్తో సహా ప్రపంచ మార్కెట్లన్నీ ఒడిదొడుకులన్నప్పటికీ సానుకూలంగా ముగిశాయి.
వరుసగా రెండోవారం సైతం ఎన్ఎస్ఈ నిఫ్టీ 19,875 పాయింట్ల గరిష్ఠస్థాయిని చేరిన తర్వాత అమ్మకాల ఒత్తిడిని చవిచూసింది. చివరకు 63 పాయింట్ల లాభంతో 19,795 పాయింట్ల వద్ద ముగిసింది.