పాజిటివ్ ట్రెండ్‌లోనే నిఫ్టీ
అమెరికా వడ్డీరేట్ల త్వరితంగా తగ్గవని సంకేతాలిస్తూ అక్కడి ఆర్థిక గణాంకాలు బలంగా వెలువడుతున్నప్పటికీ భారత్‌తో సహా ప్రపంచ మార్కెట్లన్నీ ఒడిదొడుకులన్నప్పటికీ సానుకూలంగా ముగిశాయి.
అమెరికా వడ్డీరేట్ల త్వరితంగా తగ్గవని సంకేతాలిస్తూ అక్కడి ఆర్థిక గణాంకాలు బలంగా వెలువడుతున్నప్పటికీ భారత్‌తో సహా ప్రపంచ మార్కెట్లన్నీ ఒడిదొడుకులన్నప్పటికీ సానుకూలంగా ముగిశాయి. ఈ క్రమంలో ఎన్ఎస్ఈ నిఫ్టీ 50 గతవారం 1.19 శాతం పెరిగి 22,041 పాయింట్ల వద్ద ముగిసింది. ఇందుకు భారత్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం తగ్గడం, పారిశ్రామిక ఉత్పత్తి పెరగడం సహకరించాయి. ఈ నేపథ్యంలో ఈవారం సైతం ట్రెండ్ పాజిటివ్‌గా ఉంటుందని విశ్లేషకులు పేర్కొన్నారు. నిఫ్టీ 20డీఎంఏ, 50 డీఎంఏ ఎగువన ముగియటం సానుకూల ట్రెండ్‌కు దోహదపడుతున్నదని సాంకో సెక్యూరిటీస్ సీఈవో జిమిత్ మోదీ చెప్పారు. ఇప్పటి వరకు ఏ వారంలో ముగియనంత గరిష్ఠ స్థాయిలో నిఫ్టీ ముగియటం పాజిటివ్‌నెస్‌ను సూచిస్తున్నదని యాక్సిస్ సెక్యూరిటీస్ రీసర్చ్ హెడ్ రాజేశ్ పాల్వియా తెలిపారు.
నిఫ్టీ తక్షణ మద్ధతు 21,800
ఈవారం ఒడిదొడుకులు ఏర్పడితే తక్షణం 21,800 స్థాయి మద్దతు ఇవ్వవచ్చని 22,400 దిశగా కదలవచ్చని ఛాయిస్ బ్రోకింగ్ ఈడీ సుమిత్ బగాడియా అంచనావేశారు. ఈ వారం 22,222 స్థాయి నిరోధాన్ని కల్పించవచ్చని, ఆ స్థాయిని దాటితే 22,300 స్థాయిని అందుకోవచ్చునని జిమిత్ మోదీ విశ్లేషించారు. వీక్లి మద్దతు 21,650 వద్ద ఉన్నదన్నారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

