కల్వకుర్తి, ఆగస్టు 13 : తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ చెప్పిన మాటలు అక్షర సత్యాలుగా నిలుస్తున్నాయి. కాంగ్రెసోళ్లు చెప్పే మాయ మాటలు నమ్మితే మోసపోయి గోసపడుతారని హెచ్చరించారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా పలు సభల్లో కేసీఆర్ స్పష్టంగా చెప్పారు. అధికారం కోసం అర్రులు చాస్తున్న కాంగ్రెస్ పార్టీ నమ్మించి గొంతు కోసేందుకు మీముందుకు వస్తుందని, నమ్మి ఓటేస్తే నట్టేట మునుగుతారని ముందే హెచ్చరించారు.
ఇప్పుడు కేసీఆర్ చెప్పిందే అక్షర సత్యాలుగా మిగులుతున్నాయని రైతులు గుర్తు చేసుకుంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతుబంధు మాయమైంది, వ్యవసాయానికి కరెంట్ 12 గంటలు దాటదు. ఎరువులు దొరకవు, పండిన పంటను కొనరు. కాంగ్రెస్‌కు ఓటు వేసి కర్మ ఫలితాన్ని అనుభవిస్తున్నామని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేశారు. చెబితే వినకుంటే చెడిపోయాక చూడాలనే పెద్దల మాట తమకు అతికినట్లు సరిపోతుందని అన్నదాతలు కేసీఆర్‌ను గుర్తు చేసుకుంటున్నారు.
వ్యవసాయానికి 24గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నామ ని కాంగ్రెస్ ప్రభుత్వం ఉత్తర ప్రగల్భాలు పలుకుతుంది. నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్నాం. క్షణం కూడా కరెంట్ పోదు అంటూ మైక్ దొరికితే చాలు ఊకదంపుడు ఉపన్యాసాలు ఇవ్వడంలో పోటీ పడుతున్నారు. ఎవరైనా కొత్త వాళ్లు చూస్తే అబ్బో అని ఆశ్యర్య పడే రీతిలో గప్పాలు కొడుతుంటారు. క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తే పరిస్థితులు కాంగ్రెస్ పాలకుల మాటలకు విరుద్ధంగా ఉంటాయి.
24గంటల కరెంట్ దేవుడెరుగు.. 12 గంటల కరెంట్ కూడా రావడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉదయం 5గంటల నుంచి సాయంత్రం 5ంటల వరకు మాత్రమే వ్యవసాయానికి కరెంట్ సరఫరా అవుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 12గంటల కరెంట్ సరఫరాలో కూడా 4,5 సార్లు కరెంట్ ట్రిప్ అవుతుందని వాపోతున్నారు. మరి 24గంటల కరెంట్ ఎవరికి సరఫరా చేస్తున్నారో కాంగ్రెస్ ప్రభుత్వ పాలకులకు, గప్పాలు కొట్టే నేతలకు తెలియాలని రైతులు మండిపడుతున్నారు.
వ్యవసాయానికి కరెంట్ 12 గంటలకు మించి సరఫరా కావడం లేదని, 12 గంటల సరఫరాలో కూడా పలుమార్లు కరెంట్ సరఫరా నిలిచిపోతుందని ఆందోళన వ్యక్తం చేస్తూ నాగర్‌కర్నూల్ జిల్లా మార్చాల గ్రామ సర్పంచ్ తలసాని కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో రైతులు గ్రామ సమీపంలోని విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద నిరసన తెలిపారు.
24 గంటల కరెంట్ అని చెబుతున్నారు.. తీరా 12 గంటలకు గంటలు కూడా సరిగ్గా సరఫరా కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 12గంటల విద్యుత్ అ యినా సరిగ్గా సరఫరా అవుతుందంటే అదిలేదు. ఆరేడు స్లారు కరెంట్ పోయి వస్తది. కరెంట్ పోయి వస్తుండడంతో పంటలకు సరిగ్గా నీరందడం లేదు. పారిన పొలమే మళ్లీమళ్లీ పారుతుంది. పారని పొలం ఎండిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ముందే వర్షాలు సగం సగం పడతున్నాయని.. ఇప్పుడు కరెంట్ కూడా సగం సగంలా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.
నిరసనలో భాగంగా రైతులు విద్యుత్ ఉపకేంద్రంలోకి వెళ్లి వాకబు చేస్తే కరెంట్ అధికారులు ఎవరూ లేరు. కేవలం ఆపరేటర్లు మాత్రమే ఉన్నారు. వారిని అడిగితే ఉన్నతాధికారుల ఆదేశాలను పాటిస్తున్నామని చావు కబురు చల్లగా చెప్పారు. ఫోన్లో ఏఈ శ్రీనివాస్‌కు ఫోన్ చేసి కరెంట్ కష్టాలను ఏకరువు పెట్టారు. 24గంటల కరెంట్ సరఫరా కావడం లేదని ఉదయం 5 నుంచి సాయ ంత్రం 5 గంటల వరకు మాత్రమే కరెంట్ సరఫరా అవుతుందని, సరఫరా సమయంలో కూడా పలుమార్లు విద్యుత్ నిలిచిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారం వ్యవసాయానికి విద్యుత్ సరఫరా చేస్తున్నామని.. సరఫరాలో అంతరాయాలు లేకుండా చూస్తానని ఏఈ హామీ ఇచ్చాడు.
రాష్ట్ర ప్రభుత్వం 24గంటల కరెంట్ ఇస్తున్నామని కేవ లం ప్రకటనలు ఇచ్చి చేతులు దులుపుకుంటుందని రైతు సంఘాల నాయకులు మండిపడుతున్నారు. గ్రా మాల్లో వ్యవసాయానికి 12 గంటలకు మించి విద్యుత్ సరఫరా కావడం లేదని, దీని గురించి కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నిస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 24గంటలు వ్యవసాయనికి ఉచిత విద్యుత్ సరఫరా చేశామని.
ఇప్పుడు మీరు ఎందుకు సరఫరా చేయడం లేదని, రైతులను మోసం చేయడమే కాంగ్రెస్ నైజం అంటూ రైతు సంఘం నాయకులు మండిపడుతున్నారు. ము ందే సగం సగం వర్షాలు ఉన్నాయి. ఇప్పటికి వేసవి కాలంలాగానే వాతావరణం ఉంది. వేసిన పంటలకు సాగునీరు ఎక్కువ అవసరం ఉన్న నేపథ్యంలో కరెంట్ పూర్తి స్థాయిలో సరఫరా చేయకుండా ఎందుకు రైతులను ఇబ్బందుల పాలు చేస్తున్నారని రైతు నాయకులు ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.
కాంగ్రెస్ పాలనలో రైతులకు కష్టాలు నిత్యకృత్యమయ్యాయి. ఎరువుల నుంచి రైతుల కష్టాలు ప్రారంభమవుతాయి. చచ్చి చెడి ఎరువులు సంపాదించుకుంటే.. ఇప్పుడే కరెంట్ కష్టాలు ప్రారంభమయ్యాయి. వర్షాలు సమృద్ధిగా కురియక పోవడంతో రైతులు భూగర్భ జలాలను నమ్ముకున్నారు. భూగర్భజలాలు తోడేందుకు మోటర్లకు విద్యుత్ అవసరం. కేసీఆర్ హయాంలో 24 గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరా ఉండడంతో అవసరం ఉన్నప్పుడు రైతులు 24గంటల విద్యుత్‌ను ఉపయోగించుకునే వారు.
ఉదాహరణగా కల్వకుర్తి మండ లం తాండ్ర గ్రామానికి చెందిన చంద్రారెడ్డి తనకున్న 10 ఎకరాలను సాగుచేశాడు. కేసీఆర్ పాలనలో కరిగెట్టును వారం రోజుల్లో సిద్ధం చేసి వరిని నాటేవాడు. ఇప్పుడు 12 గంటల కరెంట్ కావడం, అదికూడా వచ్చి పోతుండడంతో కరిగెట్టు చేయడంతో ఇబ్బందుల తలెత్తుతున్నాయి. కరిగెట్టు ప్రారంభించి నెలరోజులు గావస్తున్నా పూర్తి కావడం లేదు. వరి నారు ముదిరి పోతు ంది. ఇదంతా కరెంట్ పూర్తి స్థాయిలో సరఫరా కాకపోవడం వల్లే అని వాపోయాడు. ఇది చంద్రారెడ్డికి వచ్చిన బాధ కాదు.. దాదాపు రైతులందరిదీ ఇదే పరిస్థితి.
నారాయణపేట, ఆగస్టు 13 : మక్తల్- నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకంలో చోటు చేసుకున్న అవకతవకలు, అవినీతి ఆరోపణలపై సమగ్ర విచారణ చేపట్టాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రాజేందర్‌రెడ్డి, మక్తల్ మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి, కొడంగల్ మాజీ ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డి డిమాం డ్ చేశారు. ఈ మేరకు వారు గురువారం లోకాయుక్తకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా రాజేందర్‌రెడ్డి మాట్లాడుతూ నారాయణపేట మండలం పేరపళ్ల గ్రామ శివారులో చేపట్టిన భూముల సేకరణలో పెద్ద ఎత్తున అక్రమాలు చోటు చేసుకున్నట్లు తెలుస్తుందన్నారు.
దొంగ పాసుపుస్తకాలతో నష్ట పరిహారం ఎత్తుకునేందుకు కాంగ్రెస్ నాయకులు పన్నాగం పొందేందుకు ప్రణాళికలు రూ పొందించినట్లు పక్కా సమాచా రం ఉందన్నారు. పేరపళ్ల శివారులోని జాయమ్మ చెరువులో నీరు నిల్వ చేయ డం వలన కొంత మంది రైతులకు సంబంధించి భూములు కోల్పోకున్న భూ ములు కోల్పోతున్నట్లు పేర్కొనడం, సర్వే నెం బర్లు ఒక చోట ఉంటే భూము లు ఒక చోట ఉన్నట్లు అధికారులు చెప్పడం రైతుల ను అయోమయానికి గురి చేస్తుందన్నారు. ప్రభుత్వ నిధులు దుర్వినియోగం కాకుండా ప్రాజెక్టు పనుల్లో పారదర్శకత ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. విచారణలో అవినీతి, అక్రమాలు నిబంధనలు ఉల్లం ఘించినట్లు తేలితే సంబంధిత అధికారులు, బాధ్యు లపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
కాంగ్రెస్ పార్టీ తమది రైతు ప్రభుత్వమని పదే పదే ప్రకటనలు ఇస్తుం ది. కేసీఆర్ హయాంలో వ్యవసాయానికి 24గంటల కరెంట్ సరఫరా అయ్యే ది. రైతు ప్రభుత్వమని చెప్పుకుంటున్న కాంగ్రెస్ మాత్రం చాలిచాలని 12గంటలు కూ డా సరిగ్గా కరెంట్ ఇవ్వలేక పోతుంది. రైతులకు ఏవిధంగా కూడా న్యాయం చేయలేని కాంగ్రెస్ రైతు పక్షపాతి ఎలా అవుతుంది. రైతులకు అన్ని విధాలా అన్యాయం చేస్తున్న కాం గ్రెస్ ప్రభుత్వానికి రైతుల ఉసురు తగులుతుంది. రైతులను కష్టపెట్టి బతికి బయటపడ్డ ప్రభుత్వం ఏదీలేదు. ఇచ్చిన మాట ప్రకారం రైతులకు 24గంటల ఉచిత కరెంట్ ఇవ్వాల్సిందే.
– పురం రాంరెడ్డి, రైతు, మార్చాల, కల్వకుర్తి మండలం
24గంటల విద్యుత్ కొనసాగిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది, ఇప్పుడు హామీని నిలుపుకోవడం చాతకాక ఉత్తర ప్రగల్భాలు పలుకుతుంది. వ్యవసాయానికి 12గంటల కరెంట్ ఇవ్వడానికి చాతకావడం లేదు. రైతుల కోసం ఎలాంటి ఆందోళనకైన సిద్ధం. రైతుల నుంచి సేకరించిన పాలకు బిల్లులు సకాలంలో ఇవ్వడం చాతకాని కాంగ్రెస్ ప్రభుత్వం కోతలు కోటలు దాటుతాయి. రైతులపై కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రేమ ఉంటే రైతులకు 24గంటల నాణ్యమైన అంతరాయాలు లేని విద్యుత్ సరఫరా చేయాలి. గ్రామంలో రైతులు ప్రతి రోజు కరెంట్ గురించి, ఎరువుల గురించి మధన పడుతున్నారు.
– తలసాని కృష్ణారెడ్డి, సర్పంచ్, మార్చాల, కల్వకుర్తి మండలం