ఎట్టకేలకు బ్రేక్ అవుట్
ఎన్నో వారాలు.. పలు ప్రయత్నాల అనంతరం ఎన్ఎస్ఈ నిఫ్టీ బ్రేక్ అవుట్ సాధించింది. వారం మొత్తంమీద 524 పాయింట్లు లాభపడి 19,189 పాయింట్ల వద్ద ముగిసింది.
ఎన్నో వారాలు.. పలు ప్రయత్నాల అనంతరం ఎన్ఎస్ఈ నిఫ్టీ బ్రేక్ అవుట్ సాధించింది. వారం మొత్తంమీద 524 పాయింట్లు లాభపడి 19,189 పాయింట్ల వద్ద ముగిసింది. 2022 డిసెంబర్ 1నాటి 18,887 పాయింట్ల రికార్డుస్థాయిని అధిగమించడం ద్వారా జరిగింది ఫాల్స్ బ్రేక్అవుట్ కాదని భావించాలంటే ఈ వారం సైతం నిఫ్టీ గరిష్ఠస్థాయిలోనే కన్సాలిడేట్కావడం లేదా మరింత ముందుకుసాగాల్సి ఉంటుందని విశ్లేషకులు అంటున్నారు. ఒలాటాలిటీ ఇండెక్స్ (వీఐఎక్స్) ఇటీవలి సంవత్సరాల్లో ఎన్నడూ లేనంత కనిష్ఠస్థాయి 10.80 వద్దకు తగ్గినందున, ఇన్వెస్టర్లు జాగురూకతతో వ్యవహరించాలని ఈక్విటీరీసెర్చ్ ఆసియా వ్యవస్థాపకుడు మిలన్ వైష్ణవ్ సూచించారు. ఇటీవల నిఫ్టీ కనపర్చిన క్షీణతకంటే పెరుగుదల వేగంగా ఉన్నందున, భారీ కరెక్షన్ వచ్చే అవకాశం లేదని సామ్కో సెక్యూరిటీస్ సీఈవో జిమిత్ మోది చెప్పారు.
మద్దతు శ్రేణి 18,900-19,000 గతవారం జరిగిన బ్రేక్ అవుట్ బలపడాలంటే నిఫ్టీ 18,900 స్థాయిని వదులుకోకూడదని వైష్ణవ్ తెలిపారు. ఈ వారం నిఫ్టీకి 19,280, 19,450 స్థాయిల వద్ద అవరోధాలు కలగవచ్చని, 18,900 మద్దతును కోల్పోతే 18,650 స్థాయివరకూ తగ్గవచ్చని అంచనా వేశారు. 19,200పైన స్థిరపడితే 19,450 పాయింట్ల వరకూ ర్యాలీ కొనసాగవచ్చని ఏంజిల్ఒన్ టెక్నికల్ విశ్లేషకుడు అమర్దేవ్ సింగ్ అంచనా వేశారు. 19,100 పైన నిలదొక్కుకుంటే 19,300, 19,500 స్థాయిల్ని అందుకోవచ్చని, 19,000, 18,888 జోన్స్‌లో మద్దతు పొందవచ్చని మోతీలాల్ ఓస్వాల్ రీసెర్చ్ హెడ్ చందన్ తపారియా విశ్లేషించారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sreeja Reddy | అమెరికాలో నల్గొండ యువతి అదృశ్యం.. వాకింగ్‌కు వెళ్లి తిరిగిరాని శ్రీజా రెడ్డి!
Summer Holidays | మధురమైన బాల్యపు ప్రయాణం.. ‘సమ్మర్ హాలిడేస్’ మూవీ రివ్యూ
ఎఫ్ఎంజీ వైద్యులపై పోలీసుల ఉక్కుపాదం.. నిరసనకారులను ఈడ్చుకెళ్లి అరెస్టు!
Shiraz Mehdi | చిన్న సినిమాల హక్కుల కోసం యుద్ధం తప్పదు: హీరో షిరాజ్ మెహదీ
U-19 Asia Cup: ఆర్యావీర్ సెహ్వాగ్, లక్ష్య రాయిచందానీ హాఫ్ సెంచరీలు.. ఆసియా అండర్-19లో భారత్ బోణీ
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

