గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆదిలాబాద్ పట్టణం త్రివర్ణ శోభితమైంది. 74వ గణతంత్ర దినోత్సవాన్ని గురువారం అన్ని కార్యాలయాల్లో ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ బంగ్లాలో జాతీయ జెండాను కలెక్టర్ సిక్తా పట్నాయక్
దేశంలో పేద, ధనిక అంతరం భారీగా పెరుగుతున్నదని, ఈ అంతరం తగ్గాలని అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. దేశంలో ఒక శాతం ఉన్న ధనికుల చేతిలో 40 శాతం సంంపద ఉన్నదని సర్వేలు చెప్తున్నాయని తెలిపారు.
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సారథ్యంలో లిఖించబడిన భారత రాజ్యాంగం ప్రపంచంలోనే గొప్ప సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర దేశంగా మన సొంతం అయిందని కలెక్టర్ వినయ్‌క్రిష్ణారెడ్డి అన్నారు.
జిల్లాల్లో 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ప్రజలు గురువారం ఊరూరా ఘనంగా నిర్వహించుకున్నారు. రా జ్యాంగాన్ని రచించి భారతదేశానికి దిశానిర్దేశం చేసిన మహానీయుడు అంబేద్కర్ అని అదనపు ఎస్పీ బాలస్వామి అన్నా రు.
రాష్ట్రాల సమాఖ్యగా వర్థిల్లుతున్న భారత దేశంలో ఫెడరల్ స్ఫూర్తి పరిఢవిల్లుతూ, న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం మూలస్తంభాలుగా పాలన సాగినప్పుడు మాత్రమే దేశంలో సంక్షేమం విలసిల్లి, మరింత ప్రగతి పథంల�