సద్భావనా గుణ తంత్రం
నా దేశం సద్భావనకు చిరునామా..
నా దేశం సద్భావనకు చిరునామా..
నా మాతృభూమి సుహృద్భావ
సౌశీల్యానికి వీలునామా
చెట్టపట్టాల్ పట్టుకుని
దేశస్థులంతా నడవమన్న
గురజాడ అడుగుజాడలో కాక..
మతాల మత్తులో కులాల కుళ్ళులో
కొట్టుమిట్టాడుతూ ఉంటే..
చెట్టుకొకరం.. పుట్టకొకరం
అవుతామనే అవగాహన ఉన్నవాళ్ళం మనం
ఆలోచించి చరించే జాతి మనది..
పరాయి జులుం నిరాకరించి
రాజుల పాలన తృణీకరించి
స్వరాజ్య సాధన లక్ష్యంగా
సాగించాము ప్రజోద్యమం
సాధించాము స్వాతంత్య్రం
ఆరంభించాం గణతంత్రం..
అసలు గణతంత్రమంటే?
రాజ్యాంగబద్ధ ప్రజాస్వామ్య పరిపాలన ..
మతాతీత కులరహిత వ్యవస్థారంభ సూచన
ఒక వంక సుప్రభాతం వీనుల విందుగ
ఒక వంక మసీదు నుంచి అజా అల్లా స్మరణగా..
మరోవంక చర్చి గంటలు ప్రార్థనా సంకేతంగా..
ఆవంక వాహే గురు పఠనం ప్రబోధకంగా
ఓహ్ ఇది కదా మన భారతి తరతరాల సంస్కృతి..
భిన్నత్వంలో ఏకత్వం.. ఏకత్వంలో సమానత్వం
సమానత్వంలో సహోదరత్వం..
సహోదరత్వమే గణతంత్రం
సద్భావనా గుణ తంత్రం.
ఎవరు హిందు, ఎవరు తురక, ఎవరురా కిరస్తానీ…
ఎవనిది తెలుగెవనిది యెవనిది హిందుస్తానీ???
అనే ప్రశ్న మహా కవులది కాదు మానవతది, మహాత్ములది..
మానవత్వం పరిమళిస్తే మంచి మనస్తత్వం
మతతత్వం పెల్లుబికితే జాతికి అరిష్టం..
దేశమంటే మట్టికాదు.. మనుషులే అన్నది సత్యం..
గట్టి మేల్ తలపెట్టే నేతకే కట్టాలి పట్టం
హిమాలయోత్తుంగ శృంగాలనంటే
యశస్సుకు మేం వారసులం
హిందూ సాగర కెరటాలపై ప్రతిబింబించే జాత్యున్నతికి
మేం నిఖార్సయిన హిస్సేదార్లం
మా అణువణువూ నినదిస్తుంది
జనగణమనముల గీతం..
జాతి ఐక్యతా సందేశం
మత సామరస్యానికి మచ్చుతునక
కాదుకాదు.. మెచ్చు తునక మన తెలంగాణ..
సిరుల మేలు బంతి..
ప్రజోపయోగ పథకాల ముందంజ..
కళాకారులకు కాణాచి.. అన్నిటా ముందువరుస..
సబ్బండవర్గాల శాంతి సౌఖ్యాల పరిపాలన
తోడుగా నడవాలని తహతహలాడే తోటి రాష్ర్టాలు..
కలుపుక పొండని కలవరించే
యావద్దేశ కర్షక, కార్మిక జనావళి అబ్బురపరచే అభివృద్ధి
మా ఉద్యమస్ఫూర్తికి వందనాలు
మా నేత బాపూ కేసీఆర్‌కు అభినందన చందనాలు..
మా ఐక్యతావాదం మాకు కొండంత అండ
మా గుండెల నిండా మువ్వన్నెల జెండా
జనని భారతికి నీరాజనం… జాతి సమైక్యతకు సుస్వాగతం…
శ్రీదేవి మంత్రి
(కవయిత్రి: రాష్ట్ర అధికార భాషా సంఘం అధ్యక్షురాలు)
Read Today's Latest Editpage News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Palamuru Rangareddy Lift Irrigation | కాంగ్రెస్ సర్కార్ అలసత్వం.. పాలమూరు- రంగారెడ్డి మోటార్లు బంద్
Riteish Deshmukh | రామ్ పోతినేని ‘RAPO 23’ టీంలోకి రితేశ్ దేశ్‌ముఖ్
Amazon Jobs | ఆ చట్టం అమల్లోకి వస్తే.. అమెజాన్‌లో మళ్లీ ఉద్యోగాల కోత.. ?
smit machchhar | ఆ విషయం నాకు నిజంగా తెలియదు : కెప్టెన్ స్మిత్ మచ్చర్
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

