తెలంగాణ ప్రయోజనాలే లక్ష్యం
పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) విషయంలో బీఆర్ఎస్ వైఖరి ఎప్పుడూ స్పష్టంగానే ఉన్నదని ఆ పార్టీ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పునరుద్ఘాటించారు. దక్షిణ భారత రాష్ట్రాల పార్లమెంటరీ ప్రాతినిధ్యంలో ఎలాంటి తగ్గుదల ఉండకూడదని, తెలంగాణకు జరిగే ఏ అన్యాయాన్నీ సహించబోమని స్పష్టంచేశారు.
- దక్షిణాదికి అన్యాయం జరిగితే సహించం
- దక్షిణాది రాష్ర్టాల 24% వాటాను కాపాడాలి
- మహిళా రిజర్వేషన్లకు సంపూర్ణ మద్దతు
- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
- బిల్లుకు బీఆర్ఎస్ మద్దతు: వద్దిరాజు
హైదరాబాద్, నవంబర్ 28 (నమస్తే తెలంగాణ): పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) విషయంలో బీఆర్ఎస్ వైఖరి ఎప్పుడూ స్పష్టంగానే ఉన్నదని ఆ పార్టీ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పునరుద్ఘాటించారు. దక్షిణ భారత రాష్ట్రాల పార్లమెంటరీ ప్రాతినిధ్యంలో ఎలాంటి తగ్గుదల ఉండకూడదని, తెలంగాణకు జరిగే ఏ అన్యాయాన్నీ సహించబోమని స్పష్టంచేశారు. ఈ మేరకు శనివారం ఎక్స్ వేదికగా తన అభిప్రాయాలను వెల్లడించారు.
ప్రస్తుతం పార్లమెంటులో దక్షిణాది రాష్ర్టాలకు ఉన్న 24 శాతం ప్రాతినిధ్య వాటాను యథాతథంగా కాపాడాలని బీఆర్ఎస్ నిరంతరం డిమాండ్ చేస్తున్నదని తెలిపారు. 2051 వరకు అంతర్రాష్ట్ర ప్రాతినిధ్య నిష్పత్తిలో ఎలాంటి మార్పు లేకుండా రక్షణ కల్పిస్తూ, పార్లమెంట్ స్థానాలను 50 శాతం పెంచాలనే ప్రతిపాదన తమ ప్రధాన ఆందోళనకు పరిషారం చూపుతున్నదని అభిప్రాయపడ్డారు. ఈ ప్రతిపాదన అమలైతే తెలంగాణలో లోక్‌సభ స్థానాలు ప్రస్తుతమున్న 17 నుంచి 26కు పెరుగుతాయని తెలిపారు.
తెలంగాణ ప్రయోజనాలకు ప్రాధాన్యతనిస్తూ బీఆర్ఎస్కు చెందిన ముగ్గురు రాజ్యసభ సభ్యులు ఈ ప్రతిపాదనకు అనుకూలంగా ఓటు వేస్తారని స్పష్టంచేశారు. మహిళా రిజర్వేషన్లకు బీఆర్ఎస్ ఎప్పుడూ మద్దతు ఇస్తూ వస్తున్నదని తెలిపారు. మహిళలకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించే రిజర్వేషన్ల అమలుకు పార్టీ కట్టుబడి ఉన్నదని స్పష్టం చేశారు. దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యానికి రక్షణ, తెలంగాణకు న్యాయం, మహిళా రిజర్వేషన్ల అమలు అనే అంశాలే డీలిమిటేషన్‌పై బీఆర్ఎస్ వైఖరిలో ప్రధానమని వెల్లడించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

