BRS Party | అర్వపల్లి, అక్టోబర్ 12 : అమలు చేయని అబద్ధపు హామీలతో గద్దెనెక్కిన ప్రజా పాలన పేరుతో పూర్తిగా విఫలమైన కాంగ్రెస్ పార్టీ మోసాలను ఎండ కడుతూ తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ ఆదేశాల మేరకు ఆదివారం అర్వపల్లి మండల కేంద్రంలో ఇంటింటికి తిరుగుతూ బీఆర్ఎస్ మండల పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ బాకీ కార్డులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గుండగాని సోమేశ్ గౌడ్ మాట్లాడుతూ.. అబద్ధపు హామీలను ఇచ్చి ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకులను నిలదీసే సమయం ఆసన్నమైందని అన్నారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు బొడ్డు రామలింగయ్య, కట్టెల మల్లేష్, వల్లపు గంగయ్య, రాంకోటి, సైదులు, విజయ్ ఎల్లంరాజు, సురేష్, గణేష్, రాజు, లింగరాజు పాల్గొన్నారు.
Bihar Election | అభ్యర్థులను ఖరారు చేసిన జేడీయూ.. నాలుగు స్థానాలలో సిట్టింగ్లకు ఉద్వాసన..!
Explosives In Bag | వదిలేసిన బ్యాగులో పేలుడు పదార్థాలు.. బాంబ్బ్లాస్ట్కు కుట్రగా అనుమానం
Narnoor | మద్యం సేవించి వాహనాలు నడిపితే చర్యలు : ఎస్ఐ అఖిల్