Paddy Crop | కోదాడ : మొంథా తుఫానుతో ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షానికి కోదాడ నియోజకవర్గంలో పక్షం రోజుల్లో చేతికొచ్చే దశలో ఉన్న వరి పంట నీట మునిగింది. దీంతో ఎకరాకు 20వేలకుపైగా పెట్టుబడి పెట్టి పంట ఇంటికొచ్చే తరుణంలో మాయదారి తుఫానుతో వరి పంట మునిగి రైతులు బోరున విలపిస్తున్నారు. దీంతోపాటు బలంగా వీచిన గాలులతో అక్కడక్కడ చెట్లు నేలకొరిగాయి.
లోతట్టు కాలనీలు కొన్ని జలమయమయ్యాయి. పంట నష్టం అంచనా వేసి పరిహారం చెల్లించాలని రైతులతోపాటు మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మొంథా తుఫాను ప్రభావంతో కోదాడ నియోజకవర్గంలోని కోదాడ, అనంతగిరి, మునగాల, నడిగూడెం, మోతే, చిలుకూరు మండలాల్లో వేలాది ఎకరాల పంట నీట మునిగింది.
మరో 15 రోజుల్లో వరి కోత కొచ్చే పరిస్థితి..ఈ లోగా తుఫాను ప్రభావంతో మంగళవారం అర్ధరాత్రి నుంచి కురిసిన భారీ వర్షానికి వరి పంట నీట మునిగింది. మునుగుతున్న పంటను రైతులు రక్షించుకోలేని పరిస్థితుల్లో నిస్తేజంగా చూడడం తప్ప ఏమి చేయలేకపోయారు. తెల్లవారి మునిగిన పంటను చూసి బోరును వినిపిస్తున్నారు. ఎకరాకు 20వేలకుపైగా పెట్టుబడి పెట్టి ఎరువులు వేసి పురుగు మందులు పిచికారి కొట్టి రక్షించుకున్న పంట నీట మునగడంతో నెత్తి నోరు బాదుకుంటున్నారు.
దీంతోపాటు నియోజకవర్గంలోని బలంగా వీచిన గాలులతో అక్కడక్కడ చెట్లు నేలమట్టమయ్యాయి. ఇక కోదాడ పట్టణంలో శ్రీమన్నారాయణ కాలనీ లోతట్టు ప్రాంతంలో వరద నీరు చేరింది. వరద నీటిని ఇళ్లలోకి రాకుండా మున్సిపల్ సిబ్బంది చర్యలు తీసుకుంటున్నారు.
Landslides | భారీ వర్షానికి శ్రీశైలం ఘాట్ రోడ్డులో విరిగిపడిన కొండచరియలు.. ట్రాఫిక్కు అంతరాయం
Suicide: భార్యతో వీడియో కాల్లో మాట్లాడుతూ.. సౌదీలో ఆత్మహత్య చేసుకున్న భర్త
Jaanvi Swarup | హీరోయిన్గా మహేష్ బాబు మేనకోడలు..సంతోషం వ్యక్తం చేసిన మంజుల