Nutankal Farmers | నూతనకల్, మార్చి 6 : నూతనకల్ మండలంలో రైతుల ఆందోళన మొదలైంది. ఆరుగాలం శ్రమించి అప్పులు తెచ్చి పెట్టుబడులు పెట్టి వరి నాట్లు వేసిన రైతులకు కండ్ల ముందే పొలాలు ఎండిపోతుంటే వారి గుండె చెరువు అవుతుంది. మండలవ్యాప్తంగా ఎస్సారెస్పీ కాలువల ద్వారా గోదావరి జలాలు రాక చెరువులు, కుంటలు, బోరుబావులు, బావులు, భూగర్భ జలాలు అడుగంటి పోయాయి. ఏ గ్రామంలో చూసినా వరి పంట పొలాలు ఎండిపోయి దర్శనమిస్తున్నాయి.
ఎండిపోయిన పొలాలు పశువులకు, గొర్రెలకు, మేకలకు మేతగా మారాయి.మండలంలోని రైతుల పరిస్థితి ఆగమ్య గోచరంగా తయారైంది అటు కాళేశ్వరంలో నిండుగా నీరు ఉన్నప్పటికీ ప్రజా ప్రతినిధులు అధికారులు నిర్లక్ష్యం వల్ల ఎస్సారెస్పీ కాలువల ద్వారా నీటిని విడుదల చేయక రైతులు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారు ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు అధికారులు స్పందించి వెంటనే నీరును విడుదల చేసి రైతన్న ఆదుకోవాలని మండల రైతులు కోరుతున్నారు.
అప్పులు తీర్చాలంటే ఏదైనా అమ్మాల్సిందే : దేవి రెడ్డి సత్తిరెడ్డి నూతనకల్ రైతు
యాసంగిలో 10 ఎకరాల వరి పంట సాగు చేశా దీనికోసం సుమారు మూడు లక్షల రూపాయలు పెట్టుబడి అయింది పంట సమయంలో రైతు భరోసా రాలేదు అంతకుముందు వేసిన పంటకు బ్యాంకు నుంచి రుణం తీసుకున్న రుణం కూడా మాఫీ కాలేదు ఇప్పుడు వేసిన పంటకు నీరు లేక పూర్తిగా ఎండిపోయింది. చేసేదేమీ లేక గొర్లను మేపుకోవడానికి ఇచ్చేశా ఈ సమయంలో పెట్టుబడి పెట్టిన డబ్బులు ఏదైనా అమ్మి తీర్చాలి ఎండిన పంటలకు ప్రభుత్వమే పరిహారం చెల్లించాలి .
ప్రజా ప్రతినిధులు అధికారులు పూర్తిగా విఫలం : గార్డుల లింగరాజు మాజీ ఎంపీటీసీ సభ్యులు
ఎస్సారెస్పీ కాలువల ద్వారా నీటిని విడుదల చేయడంలో ప్రజా ప్రతినిధులు అధికారులు పూర్తిగా విఫలమయ్యారు. గత బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ హయాంలో రెండు పంటలకు నీరు అందించారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత పూర్తిగా రైతుల విషయంలో విఫలమయ్యారు.
S Jaishankar | అధిక సుంకాలతో భారత్ – అమెరికా వాణిజ్య సంబంధాలపై అనిశ్చితి.. జై శంకర్ ఏమన్నారంటే..?
Bandlaguda Jagir | చెత్త బండ్లగూడ.. మున్సిపాలిటీలో పారిశుద్ధ్యంపై పట్టింపేది?
Janhvi Kapoor| రామ్ చరణ్ కొత్త సినిమా నుండి జాన్వీ లుక్ రిలీజ్.. ఒక్కసారిగా పెరిగిన అంచనాలు