child | సూర్యాపేట జిల్లాలో మానవత్వాన్ని మంటకలిపే ఘటన వెలుగుచూసింది. ఓ మహిళ ముక్కు పచ్చలారని పసికందును వీధిలో వదిలేసి వెళ్లిపోయింది. వివాహేతర సంబంధమో.. మహిళను నమ్మించి మోసం చేసిన పాప ఫలితమో తెలియదు కానీ మునగాల మండలం తిమ్మారెడ్డి గూడెంలో ఓ వీధిలోని గాబులో అప్పుడే జన్మించిన పసికందును వదిలివేసిన సంఘటన ఆదివారం చోటుచేసుకుంది.
వీధిలో ఆడుకుంటున్న పిల్లలకు పసికందు ఏడుపు వినిపించింది. అనుమానం వచ్చిన పిల్లలు పక్కనే ఉన్న నీళ్లు లేని గాబులో చూడగా వారికి పసికందు కనిపించింది. వెంటనే వారు ఈ విషయాన్ని చుట్టుపక్కల మహిళలతో చెప్పగా వారు అక్కడికి వచ్చి అప్పుడే జన్మించిన పసికందు అని గమనించి అక్కున చేర్చుకున్నారు. అనంతరం ఈ విషయం తెలుసుకున్న ప్రభుత్వ ఆరోగ్య సిబ్బంది సదరు పసికందును సూర్యాపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. పసికందును వదిలేసి వెళ్లిన మహిళకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.
Ear Wax Cleaning | చెవుల్లో ఉండే గులిమిని తొలగించేందుకు ఈ సహజసిద్ధమైన చిట్కాలను పాటించండి..!
Rahul portrait burnt | కాంగ్రెస్ ఆటలు సాగడం లేదని అపనిందలు.. రాహూల్ గాంధీ చిత్రపటం దహనం
Free mega medical camp | కోటగిరి లో ఉచిత మెగా వైద్య శిబిరం.. ప్రజల నుంచి విశేష స్పందన