SP Narasimha | నేరస్తుల కదలికపై నిరంతరం నిఘా ఉంచాలి : ఎస్పీ నరసింహ
SP Narasimha | ప్రజలకు ఇబ్బందులు కలగకుండా సిగ్నల్ వ్యవస్థను సజావుగా కొనసాగించాలన్నారు ఎస్పీ నరసింహ. మారుతున్న సాంకేతిక పరిణామాలను దృష్టిలో ఉంచుకొని వృత్తి నైపుణ్యాన్ని పెంచుకోవాలని, విధి నిర్వహణలో నిబద్ధతతో వ్యవహరించాలన్నారు.
SP Narasimha | పౌరులు ఇచ్చిన ఫిర్యాదులపై పారదర్శకతతో, మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తూ సత్వరమే సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ పోలీసు అధికారులకు, సిబ్బందికి సూచించారు. ఆదివారం కోదాడ పట్టణ పోలీస్ స్టేషన్ వార్షిక తనిఖీలో భాగంగా రికార్డులను పరిశీలించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. నేరస్తుల కదలికపై నిరంతరం నిఘా ఉంచాలని, గంజాయి క్రయ విక్రయాలు సైబర్ నేరాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.
కోదాడ పరిసర ప్రాంతాలలో గంజాయి విక్రయిస్తున్న నేరస్తులపై కేసులు నమోదు చేయడంతోపాటు పాత నేరస్తులకు నెలవారీ కౌన్సెలింగ్ కూడా చేపట్టాలన్నారు. యువత విద్యార్థులు గంజాయి తదితర మాదకద్రవ్యాల బారిన పడకుండా కౌన్సిలింగ్ ఇవ్వడంతోపాటు పగడ్బందీ చర్యలు తీసుకోవాల్సిన బాధ్యతను ఆయన గుర్తుచేశారు. రౌడీ షీటర్ల కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తూ ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా సిగ్నల్ వ్యవస్థను సజావుగా కొనసాగించాలన్నారు. మారుతున్న సాంకేతిక పరిణామాలను దృష్టిలో ఉంచుకొని వృత్తి నైపుణ్యాన్ని పెంచుకోవాలని, విధి నిర్వహణలో నిబద్ధతతో వ్యవహరించాలన్నారు. పోలీస్ స్టేషన్ ఆవరణలో పిచ్చి మొక్కలు పెరగకుండా పరిశుభ్రంగా ఉంచుకోవాలని సిబ్బందికి సూచించారు… శిథిలావస్థకు చేరుకున్న పోలీస్ క్వార్టర్లను డిస్మెంటల్ చేసేందుకు ఎస్పీ ఆదేశాలు జారీ చేశారు. ఆయన వెంట డీఎస్పి శ్రీనివాసరెడ్డి, పట్టణ సీఐ శివ శంకర్ నాయక్, ఎస్సైలు ఉన్నారు.
Read Also :
SKN | ‘చెన్నై లవ్ స్టోరీ’ ఈవెంట్లో ఆసక్తికర ఘటన.. ఎస్కేఏఎన్ స్పీచ్ మధ్యలో ‘జై ఎన్టీఆర్’ నినాదాలు
Prakash Raj | నటుడు ప్రకాశ్‌రాజ్‌ను వెంటనే అరెస్ట్ చేయాలి : బీజేపీ నేత
AP News | అలాంటి మనిషిని మనుషుల జాబితాలో చేర్చలేం.. మాజీ సీఎం జగన్‌పై ఏపీ మంత్రి తీవ్ర విమర్శలు..!
Read Today's Latest Suryapet News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

