SKN | హీరో కిరణ్ అబ్బవరం, శ్రీగౌరి ప్రియ జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘చెన్నై లవ్ స్టోరీ’ విడుదలకు సిద్ధమవుతోంది. ‘బేబి’ చిత్రంతో గుర్తింపు పొందిన సాయి రాజేష్ కథ అందించిన ఈ చిత్రానికి రవి నంబూరి దర్శకత్వం వహిస్తున్నారు. అమృత ప్రొడక్షన్స్, మాస్ మూవీ మేకర్స్ బ్యానర్లపై ఎస్కేఎన్, సాయి రాజేష్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందించారు. జూలై 24న సినిమా విడుదల కానుండగా, ప్రమోషన్స్‌లో భాగంగా విజయవాడలో నిర్వహించిన ‘లవ్ కార్నివాల్’ ఈవెంట్లో జరిగిన ఓ సంఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
విజయవాడలోని రాజ్ యువరాజ్ థియేటర్లో జరిగిన కార్యక్రమంలో నిర్మాత ఎస్కేఎన్ మాట్లాడుతూ తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. నేను చిన్నతనంలో విజయవాడలోనే పెరిగాను. విజయవాడ అంటే నాకు ఇంద్రకీలాద్రి గడ్డ… ‘ఇంద్ర’ సినిమా గుర్తుకొస్తుంది” అని ఆయన మాట్లాడుతుండగా, అక్కడ ఉన్న జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఒక్కసారిగా “జై ఎన్టీఆర్… జై ఎన్టీఆర్”, “బెజవాడ అంటే సింహాద్రి గడ్డ” అంటూ నినాదాలు చేశారు. ఈ అనూహ్య పరిణామంతో ఎస్కేఎన్ కొద్దిసేపు మాట్లాడకుండా నిలిచిపోయారు. అనంతరం చిరునవ్వుతో తన ప్రసంగాన్ని తిరిగి కొనసాగించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతోంది.
ఇక తన ప్రసంగాన్ని కొనసాగించిన ఎస్కేఎన్, విజయవాడతో తనకున్న అనుబంధాన్ని మరోసారి గుర్తు చేసుకున్నారు.నా చిన్ననాటి జ్ఞాపకాలన్నీ ఇక్కడే ఉన్నాయి. నా సొంత ఊరిలో మా సినిమా ఫంక్షన్ జరగడం చాలా ఆనందంగా ఉంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, రాయలసీమలో అద్భుతమైన లొకేషన్లు ఉన్నాయి. షూటింగ్‌ల కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సిన అవసరం లేదు” అని అన్నారు. ‘చెన్నై లవ్ స్టోరీ’ చిత్రంలో ఎక్కువ భాగం షూటింగ్‌ను ఆంధ్రప్రదేశ్‌లోనే నిర్వహించినట్లు ఎస్కేఎన్ తెలిపారు. బీచ్‌లో భారీ లైట్ హౌస్ సెట్ నిర్మించాం. అవసరమైన అనుమతులు చాలా వేగంగా లభించాయి. సినీ పరిశ్రమ అభివృద్ధి కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చూపిస్తున్న సహకారం అభినందనీయం” అని ఆయన పేర్కొన్నారు. జూలై 24 నాకు చాలా ప్రత్యేకమైన తేదీ. ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవి ‘ఇంద్ర’, పవన్ కళ్యాణ్ ‘తొలిప్రేమ’ చిత్రాలు కూడా ఇదే తేదీన విడుదలయ్యాయి. మెగా అభిమానిగా ఆ రోజు నాకు ఎంతో ప్రత్యేకం. ఇప్పుడు అదే రోజున ‘చెన్నై లవ్ స్టోరీ’ విడుదల కావడం ఆనందంగా ఉంది. జూలై 23 నుంచే ప్రీమియర్ షోలు ప్రారంభమవుతాయి అని చెప్పారు.
“బెజవాడ అంటే మా ‘ఇంద్రసేన’ అడ్డా” – SKN
అయితే అదే కార్యక్రమంలో ఎన్టీఆర్ అభిమానులు “జై ఎన్టీఆర్.. బెజవాడ అంటే సింహాద్రి గడ్డ..!” అంటూ నినాదాలతో హాల్‌ను మార్మోగించారు.
పరువు పోయినట్టుగా ముఖం పెట్టాడంటూ SKNపై సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. pic.twitter.com/ufXaDtFMy5
— Telugu Chitraalu (@Telugu_chitraal) July 4, 2026