Jagadish Reddy | సూర్యాపేట జిల్లా, ఫిబ్రవరి 08 : బీఆర్ఎస్ మున్సిపల్ ఎన్నికల ప్రచారం వాడవాడల జోరుగా కొనసాగుతోంది. సూర్యాపేటలో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో జనాలు గులాబీ దండుకు బ్రహ్మరధం పడుతున్నారు. మాజీమంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఆదివారం పట్టణంలోని పలు వార్డుల్లో ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు అడుగడుగునా మంగళహారతులతో స్వాగతం పలికి మహిళలు, యువత, బీఆర్ఎస్ శ్రేణులు మద్దతు ప్రకటిస్తున్నారు.
ఈ సందర్భంగా జగదీష్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీని నమ్మితే రెండేళ్లలో అభివృద్ధి శూన్యం.. అడ్డగోలుగా హామీలిచ్చి అధికారంలోకి వచ్చిండ్రు.. కేసీఆర్ ఇచ్చినయే కోతలు పెడుతున్నరు తప్ప కొత్తగా ఏమన్నా ఇచ్చిండ్రా.. ? అని ప్రశ్నించారు. రూ.2 వేల పెన్షన్ రూ.4 వేలు చేస్తామన్నారు.మహిళలకు రూ.2500, ఆడపిల్లలకు స్కూటీలన్నరు. ప్రతీ విద్యార్ధి చదువుకు అకౌంట్లో రూ.5 లక్షలు పడ్డాయా..? జాబ్ క్యాలెండరుతో మొదటి ఏడాదే రెండు లక్షల ఉద్యోగాలు అన్నరు..రూ.10 వేలు రైతుబంధు రూ.15 వేలకు పెంచుతామన్నరు.
రైతు బీమా, సన్నోడ్లకు బోనస్ విషయంలోనూ రైతులకు మొండిచెయ్యే..ఆడపిల్ల పెండ్లికి కేసీఆర్ ఇచ్చిన లక్ష తప్ప.. తులం బంగారం ఇయ్యకనే పాయె..ఇలా కాంగ్రెస్ పార్టీ అన్ని రంగాల ప్రజలను మోసం చేసింది..రెండేళ్లుగా తట్టెడు మట్టిపొయ్యని కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఎన్నికల్లో ఓట్లడుగుతుందన్నారు.కాంగ్రేసోళ్లు ఏం సాధించారని ఓట్లడుగుతున్నారో నిలదీయండి..వాళ్లు రెండేళ్లలో పెంచి పోషించినవి ఏమిటో మీ అందరికి తెలిసిందే..కాంగ్రెస్కు అధికారం ఇస్తే అవినీతి పెరిగింది తప్ప.. రాష్ట్రానికి ఒరిగిందేమి లేదు..కాంగ్రెస్కు మళ్లీ ఓటేస్తే దొంగ చేతికి తాళం ఇచ్చినట్టేనన్నారు జగదీష్ రెడ్డి.
పదేండ్ల కేసీఆర్ పాలనలో జరిగిన అభివృద్దే మీ కండ్ల ముందు కనబడుతుంది..అందుకే అభివృద్ధికి చిరునామాగా ఉన్న కారు గుర్తుకు ఓటెయ్యండి. అన్నివార్దుల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించండని జగదీష్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ప్రచారంలో మాజీ ఎంపీ, జిల్లా పార్టీ అధ్యక్షుడు బడుగుల లింగయ్య యాదవ్, మాజీ ట్రైకార్ చైర్మన్, మున్సిపల్ ఎన్నికల ఇంచార్జి రాంచందర్ నాయక్ పాల్గొన్నారు.
Nizampet | నిజాంపేటలో ఘనంగా పోచమ్మ తల్లికి బోనాలు
Madhya Pradesh | పెండ్లి కార్డులు పంచడానికి వెళ్తుండగా బైకును ఢీకొన్న ఆడి కారు.. ముగ్గురు మృతి