MBNR | మహబూబ్నగర్: పేదింటి ఆడపిల్ల పెండ్లికి ఆసరాగా ఉండాలని కేసీఆర్ కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాన్ని అమలు చేశారు. వీటిని రద్దు చేస్తే ఊరుకోం అని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ పథకాలను కొనసాగించాలని కోరుతూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో తెలంగాణ కూడలిలో చేపట్టిన నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళలపై వేధింపులు, అత్యాచారాలు జరిగితే కఠిన శిక్షలు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తీసుకున్నామని అన్నారు. బాలికలు చదువుకునేందుకు గురుకుల విద్యాలయాలు ఏర్పాటు చేశాం అని గుర్తు చేశారు. ఇంట్లో ఉన్న అందరికి పెన్షన్ ఇస్తామని కాంగ్రెస్ ఇచ్చిన హామీ నమ్మి ప్రజలు ఓటు వేశారు. కేసీఆర్ కిట్ పథకాన్ని ప్రభుత్వం నిలిపి వేసింది. చనిపోయిన రైతులకు బీమా రాకుండా ప్రీమియం కట్టలేదు. రైతు చనిపోతే కుటుంబం రోడ్డును పడే పరిస్థితి ఏర్పడింది. కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకం అమలు చేయకూడదని కోర్టు కేసు సాకుగా చూపిస్తున్నారు. ప్రభుత్వం న్యాయపరంగా ముందుకు వెళ్లడంలో నిర్లక్ష్యం వహించారు.
ఇచ్చిన హామీలు అమలు చేసేవరకు బీఆర్ఎస్ పోరాటం చేస్తది అని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజేశ్వర్ గౌడ్, ముడా మాజీ చైర్మన్ గంజి వెంకన్న, మున్సిపల్ మాజీ చైర్మన్ నర్సింహులు, పట్టణ అధ్యక్షులు శివరాజ్, మహబూబ్ నగర్ మండల అధ్యక్షుడు దేవేందర్ రెడ్డి, హన్వాడ మండల అధ్యక్షుడు కరుణాకర్ గౌడ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ రెహమాన్, ఆంజనేయులు, సీనియర్ నాయకులు నరేందర్, లక్ష్మయ్య, గణేశ్, రవికిషన్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, ఖలీమ్, నరేందర్, శ్రీను నాయక్ , సిద్దిఖి, జహంగీర్, శ్రీశైలం, కార్పొరేటర్లు జ్యోతి, లక్ష్మి, కుర్వ సత్యం, హైందవి, మీరా బాయి, మధుమోహన్, నవకాంత్, ఈశ్వరయ్య, శరత్ రెడ్డి పాల్గొన్నారు.