కరీంనగర్ కార్పొరేషన్, సెప్టెంబర్ 29 : రాష్ట్రంలోని నేత కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం వెంటనే మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం రాజకీయ విభాగం అధ్యక్షుడు వాసాల రమేశ్ మంగళవారం సీఎం రేవంత్‌రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. వృత్తి పనుల్లో మాంద్యం కారణంగా కరీంనగర్, నల్లగొండ, వరంగల్, సిరిసిల్ల జిల్లాల్లో చేనేత, పవర్లూమ్ కార్మికులు ఉపాధి కరువై ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. కుటుంబాలను పోషించుకోలేక, పిల్లలను చదివించుకోలేక, అనారోగ్యాలకు సరైన చికిత్స చేయించుకోలేక నరకం చూస్తున్నరని ఆవేదన చెందారు. ఉపాధి కల్పించే టెసో, టెక్స్టైల్ కార్పొరేషన్లు నిర్వీర్యమైపోతున్నాయని, ఈ క్రమంలో వాటిపై ఆధారపడి జీవించే కార్మికులు విధిలేని పరిస్థితుల్లో చేసిన అప్పులు తీర్చలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
కరీంనగర్ కార్పొరేషన్/ కమాన్‌చౌరస్తా, సెప్టెంబర్ 29: రాష్ట్రంలో తెలంగాణ పబ్లిక్ సూల్స్ ఏర్పాటుకు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను తక్షణమే ఉపసంహరించుకోవాలని తెలంగాణ రికగ్నైజ్డ్ సూల్స్ మేనేజ్ మెంట్ అసోసియేషన్ (ట్రస్మా) రాష్ట్ర అధ్యక్షుడు యాదగిరి శేఖర్ రావు ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల నుంచి విద్యార్థులను ఆకర్షించాలనే అంశం ఆ ఉత్తర్వుల్లో ఉండటంపై అభ్యంతరం వ్యక్తంచేశారు. ప్రభుత్వం ప్రైవేట్ విద్యా సంస్థల మనుగడను దెబ్బతీసే కుట్ర చేస్తున్నదని, ఇది రాజ్యాంగం కల్పించిన విద్యా హకును, ఎంపిక చేసుకునే స్వేచ్ఛను కాలరాయడమేనని విమర్శించారు. తకువ నమోదు పేరుతో చిన్న ప్రభుత్వ పాఠశాలల మూసివేత ఆలోచనను విరమించుకోవాలని సూచించారు. సదరు పాఠశాల్లో మౌలిక వసతులు కల్పించి, ఉపాధ్యాయులను నియమించాలని కోరారు. ప్రైవేట్ పాఠశాలలను లక్ష్యంగా చేసుకునే విధానాన్ని మానుకోవాలని సూచించారు. ఉత్తర్వులను వెనక్కి తీసుకోకపోతే ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు.