IND vs SL | తిప్పేసిన సుతార్.. విజయానికి 6 వికెట్లు కావాలంతే..!
IND vs SL : గాలే టెస్టులో ఆధిపత్యం చెలాయిస్తున్న భారత జట్టు విజయానికి చేరువైంది. నాలుగో రోజు రిషభ్ పంత్(66) అర్ధ శతకంతో కోలుకున్న టీమిండియా.. ఆపై శ్రీలంక పని పట్టింది.
IND vs SL : గాలే టెస్టులో ఆధిపత్యం చెలాయిస్తున్న భారత జట్టు విజయానికి చేరువైంది. నాలుగో రోజు రిషభ్ పంత్(66) అర్ధ శతకంతో కోలుకున్న టీమిండియా.. ఆపై శ్రీలంక పని పట్టింది. 372 పరుగుల లక్ష్య ఛేదనలో లంక బ్యాటర్లను మానవ్ సుతార్(2-30) బెంబేలెత్తించాడు. అరంగేట్రంలోనే ఆకట్టుకున్న ఈ స్పిన్నర్ రెండు వికెట్లతో మెరవగా.. ఆతిథ్య జట్టు ఓటమి అంచున నిలిచింది. ఐదో రోజు మరో ఆరు వికెట్లు తీస్తే చాలు బోణీ టీమిండియాదే.
తొలి రోజు నుంచి గాలే టెస్టుపై పట్టుబిగించిన భారత జట్టు గెలుపు వాకిట నిలిచింది. రెండో ఇన్నింగ్స్‌లో పెద్ద స్కోర్ చేయకున్నా సరే మ్యాచ్‌ను తమ గుప్పిట్లోకి తీసుకుంది శుభ్‌మన్ గిల్ సేన. దాంతో.. నాలుగోరోజు చకచకా వికెట్లు తీసి.. టీమిండియాను 193 పరుగులకే ఆలౌట్ చేసిన సంతోషం శ్రీలంకకు ఎంతో సేపు నిలవలేదు.
Stumps on Day 4 in Galle! 🏟️
Sri Lanka 84/4 in the 2nd innings#TeamIndia 6⃣ wickets away from victory in the opening #SLvIND Test.
Scorecard ▶️ https://t.co/M9LVyCAp8y pic.twitter.com/Fhu9YGYeC1
— BCCI (@BCCI) August 18, 2026
సిరాజ్ మొదలెట్టగా..
టీ బ్రేక్ అనంతరం 372 పరుగుల ఛేదనలో లంకను ఆదిలోనే దెబ్బతీశాడు సిరాజ్. ఓపెనర్ నిషాన్ మధుష్క(6)ను అతడు ఔట్ చేసి బ్రేకివ్వగా… ఆపై మానవ్ సుతార్(2-30) తిప్పేశాడు. క్రీజులో కుదురుకోవాలనుకున్న లహిరు ఉడార(16)ను, దినేశ్ చండీమాల్ స్థానంలో ఆడుతున్న పసిందు సూర్యబండార(0)లను వెనక్కి పంపి లంకను మరింత ఒత్తిడిలోకి నెట్టాడు. ప్రసిధ్ కృష్ణ ఓవర్లో కమిందు మెండిస్(2) సైత వెనుదిరగగా ఆతిథ్య జట్టు కష్టాల్లో పడింది. ఆఖర్లో వికెట్ కాపాడుకుంటూ కెప్టెన్ ధనంజయ డిసిల్వా(31 నాటౌట్), సొనాల్ దినుశా(25 నాటౌట్)లు పట్టుదలగా ఆడారు. దాంతో, నాలుగో రోజు ఆట ముగిసే సరికి 4 వికెట్ల నష్టానికి 84 పరుగులు చేసింది లంక. సిరీస్‌లో బోణీ కొట్టేందుకు ఐదోరోజు ఆ జట్టుకు 288 రన్స్ అవసరమవ్వగా.. టీమిండియాకు 6 వికెట్లు కావాలంతే.
Wicket number 2⃣ for Manav Suthar!
A sharp catch by Dhruv Jurel at gully 👏👏
Sri Lanka lose their 4th wicket
Updates ▶️ https://t.co/M9LVyCAp8y#TeamIndia | #SLvIND pic.twitter.com/41CRi1DBLn
— BCCI (@BCCI) August 18, 2026
పంత్ ఫటాఫట్
తొలి మూడు రోజులు గాలే స్టేడియంలో అదరగొట్టిన భారత జట్టు నాలుగో రోజు తడబడింది. తొలి సెషన్ నుంచి శ్రీలంక పేసర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో శుభారంభం దక్కలేదు. ఓపెనర్ యశస్వీ(0)ని అసితా ఫెర్నాండో డకౌట్ చేయగా, కేఎల్ రాహుల్(35)ను ప్రభాత జయసూర్యలు ఔట్ చేసి లంకకు బ్రేకిచ్చారు. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (8) సైతం నిరాశపరచగా.. 81వద్దే మూడు వికెట్లు పడ్డాయి. అయితే.. తొలి ఇన్నింగ్స్ శతక వీరుడు దేవ్‌దత్ పడిక్కల్(44) ‘నేనున్నాగా’ అంటూ టీమిండియాను ఆదుకున్నాడు.
రిషభ్ పంత్(66)

ధ్రువ్ జురెల్(7) సైతం విఫలమైనా.. రిషభ్ పంత్(66) తన స్టయిల్లో విజృంభించాడు. ఎడాపెడా బౌండరీలు బాది.. మెరుపు అర్ధ శతకంతో లంక బౌలర్లపై నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడ్డాడు. టెస్టుల్లో 21వ హాఫ్ సెంచరీ, వంద సిక్సర్లతో అలరించిన పంత్‌ను లహిరు కుమార వెనక్కి పంపాడు. అంతే.. అక్కడితో టెయిలెండర్లను లంక బౌలర్లు చకచకా చుట్టేశారు. దాంతో.. పంత్ ఔటైన 19 పరుగులకే టీమిండియా ఇన్నింగ్స్ ముగిసింది. తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోర్ చేసిన భారత్… ఈసారి మాత్రం 193కే ఆటౌటైంది. అయినా కూడా.. ఆతిథ్య జట్టుకు 372 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

